twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘టెంపర్’ను బీట్ చేసిన ‘డియర్ కామ్రేడ్’.. సినీ పెద్దల విస్మయం

    |

    టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నా కలిసి నటించిన చిత్రం 'డియర్ కామ్రేడ్'. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌, బిగ్ బెన్ సినిమాస్ ప‌తాకాల‌పై న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, మోహ‌న్ చెరుకూరి(సి.వి.ఎం), య‌ష్ రంగినేని సంయుక్త‌ంగా నిర్మించారు. ఈ సినిమాను భరత్ కమ్మ అనే నూతన దర్శకుడు తెరకెక్కించాడు. ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా జూలై 28న తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల అయింది. దీనికి మిక్స్‌డ్ టాక్ వచ్చింది. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది.

    మిశ్రమ స్పందన

    మిశ్రమ స్పందన

    ఈ సినిమా మంచి కాన్సెప్ట్‌తో వచ్చినప్పటికీ కొంచెం ల్యాగ్ ఉందని రివ్యూలు వచ్చాయి. అయినప్పటికీ సినిమాను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఇందులో విజయ్ దేవరకొండతో పాటు రష్మిక మందన్నా నటనకు ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు పడ్డాయి. ముఖ్యంగా లిల్లీ పాత్రలో రష్మిక ఇరగదీసేసిందని అంటున్నారు.

    కలెక్షన్ల వర్షం

    కలెక్షన్ల వర్షం

    ‘డియర్ కామ్రేడ్' తొలి రోజు భారీ స్థాయిలో వసూళ్లను సాధించింది. అయితే, సినిమా టాక్ మిశ్రమంగా ఉండడంతో ఆ తర్వాత జోరు తగ్గింది. మొత్తంగా మొదటి వారాంతంలో ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 18.85 కోట్లు(డిస్ట్రిబ్యూటర్ షేర్) వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో రూ. 12.56 కోట్లు రాబట్టింది. ఇందులో రూ.6.83 కోట్లు మొదటి రోజు వసూలు కావడం గమనార్హం.

    హిందీలోకి రీమేక్

    హిందీలోకి రీమేక్

    ఆల్రేడీ దక్షిణాదిలో ఉన్న నాలుగు భాషల్లో ఈ సినిమా విడుదల అయిపోయింది. ఇక, మిగిలిన హిందీలోనూ దీన్ని రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే సినిమా విడుదలకు ముందే బాలీవుడ్ బడా ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్‌ను చిత్ర యూనిట్ కలిసింది. దీని తర్వాత తాను ‘డియర్ కామ్రేడ్'ను హిందీలోకి రీమేక్ చేస్తానని ఆయన ప్రకటించారు.

    రీమేక్ హక్కులకు భారీ రేటు

    రీమేక్ హక్కులకు భారీ రేటు

    ‘డియర్ కామ్రేడ్' హిందీ రీమేక్ హక్కుల కోసం కరణ్ జోహార్ ఏకంగా రూ.6 కోట్లు చెల్లించారని ఓ వార్త బయటకు వచ్చింది. అంతేకాదు, గతంలో ఏ రీమేక్ హక్కుల కోసమూ ఆయన ఇంత ఖర్చు చేయలేదని బీ టౌన్‌లోని సినీ పెద్దలు విస్మయానికి గురువుతున్నారట. వాస్తవానికి జూనియర్ ఎన్టీఆర్ సూపర్ హిట్ మూవీ ‘టెంపర్'ను కూడా ఆయన రీమేక్ చేశారు. అయితే, ఈ హక్కులకు అంత మొత్తం ఇవ్వలేదని అంటున్నారు.

     ‘కబీర్ సింగ్' ప్రభావమే

    ‘కబీర్ సింగ్' ప్రభావమే

    బాలీవుడ్‌లో ఇటీవల విడుదలైన ‘కబీర్ సింగ్' ఎంతటి ప్రభావాన్ని చూపిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు రూ. 300 కోట్లు సంపాదించిన ఈ సినిమా భారతదేశ సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు రాబట్టిన టాప్ చిత్రాల్లో చోటు దక్కించుకుంది. ఈ సినిమా విజయ్ దేవరకొండ నటించిన ‘అర్జున్ రెడ్డి' రీమేక్ కావడంతోనే ‘డియర్ కామ్రేడ్' హక్కుల కోసం పోటీ వచ్చిందని టాక్.

    English summary
    Tollywood Young Hero Vijay Deverakonda Upcoming movie is Dear Comrade. Bharat Kamma directed By This Movie. This Movie Will Remake In Bollywood by Big Producer Karan Johar.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X