విజయ్ దేవరకొండపై షాకింగ్ రూమర్... దిల్ రాజుతో ఆ ఇష్యూ నిజమేనా?

పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి సినిమాలతో నటుడిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ... 'గీత గోవిందం'తో రూ.100 కోట్ల క్లబ్ హీరోగా మారి తన రేంజి మరింత పెంచుకున్నాడు. ఆయన చేసిన 'టాక్సీవాలా' రిలీజ్ ముందే లీక్ అయినా మంచి లాభాలు తెచ్చే స్థాయిలో బాక్సాఫీస్ బిజినెస్ చేసిందంటే విజయ్ సినిమాలకు ఉన్న డిమాండ్, క్రేజ్ అర్థం చేసుకోవచ్చు.

ప్రస్తుతం భరత్ కమ్మ దర్శకత్వంలో 'డియర్ కామ్రేడ్' చిత్రం చేస్తున్న విజయ్.. దీని తర్వాత 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు' మూవీ ఫేం క్రాంతి మాధవ్‌తో మరో సినిమా చేయబోతున్నాడు. 2020 వరకు తన కాల్షీట్లు ఖాళీ లేనంత బిజీగా ఉన్నడు ఈ యంగ్ స్టార్.

విజయ్ దేవరకొండ కోసం నిర్మాతల పోటీ

విజయ్ దేవరకొండ కోసం నిర్మాతల పోటీ

ఫ్యూచర్ సినిమాల కోసం అయినా విజయ్ డేట్స్ దక్కించుకోవాలని పలువురు నిర్మాతలు పోటీ పడుతున్నారు. ఇందుకు కారణం విజయ్ సినిమాలకు మంచి బిజినెస్ జరుగుతుండం, ప్రాపిట్స్ కూడా అదే స్థాయిలో ఉండటమే.

దిల్ రాజు కూడా ప్రయత్నించారా?

దిల్ రాజు కూడా ప్రయత్నించారా?

తెలుగు టాప్ ప్రొడ్యూసర్లలో ఒకరైన దిల్ రాజు సైతం.. విజయ్ దేవరకొండతో సినిమా చేయడానికి అతడితో సంప్రదింపులు జరిపినట్లు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే విజయ్ డిమాండ్ చేసిన రెమ్యూనరేషన్‌తో దిల్ రాజు కంగుతిన్నట్లు చర్చించుకుంటున్నారు.

రూ. 10 కోట్లు అడిగినట్లు రూమర్స్

రూ. 10 కోట్లు అడిగినట్లు రూమర్స్

విజయ్ దేవరకొండ రూ. 10 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడంతో... దిల్ రాజు ఆలోచనలో పడినట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. గీత గోవిందం, టాక్సీవాలా మంచి విజయం సాధించడంతో పాటు భారీ లాభాలు తేవడంతో విజయ్ తన రెమ్యూనేషన్ పెంచినట్లు చర్చించుకుంటున్నారు.

రూ. 10 కోట్ల రెమ్యూనరేషన్ సబబేనా?

రూ. 10 కోట్ల రెమ్యూనరేషన్ సబబేనా?

విజయ్ దేవరకొండ అప్పుడే రూ. 10 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడం సబబేనా? అంటే అవును అని మరికొందరి వాద. ఆయన సినిమాలకు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది, ప్రీ రిలీజ్ బిజినెస్, బాక్సాఫీసు వద్ద కలెక్షన్లు అదే స్థాయిలో ఉంటున్నాయి. తన డిమాండుకు తగిన విధంగానే విజయ్ చార్జ్ చేయడంలో తప్పులేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X