ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ.. ఆ వీడియో లీక్‌తో రచ్చరచ్చ

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదనే చెప్పాలి. ఎందుకంటే పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి చిత్రాలతో విజయ్ దేవరకొండ క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. ఆయన టాలెంట్ తో సెపరేట్ ఫ్యాన్ బేస్ ను కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఆయనకంటూ తెలుగు మార్కెట్ లో మంచి డిమాండ్ ఏర్పరుచుకున్నారు. ఇక తన ప్రతి సినిమాతో ఆడియెన్స్ ను, ఫ్యాన్స్ ను ఏదోలా సర్ ప్రైజ్ చేయాలని ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటారు. కాగా నెక్ట్స్ విజయ్ దేవరకొండ నుంచి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ కింగ్డమ్ కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తుండగా.. తాజాగా అదిరిపోయే వీడియోతో కడుపు నింపేశాడు. ఆ వివరాల్లోకి వెళితే..

విజయ్ కు సెపరేట్ ఫ్యాన్ బేస్..
పెళ్లి చూపులు చిత్రంతో విజయ్ దేవరకొండ హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. అంతకు ముందు నాని హీరోగా నటించిన కృష్ణగాడి వీరప్రేమ గాథ చిత్రంలో రిషి అనే సపోర్టెడ్ పాత్రలో నటించి మెప్పించారు. పెళ్లి చూపులు, ఆ తర్వాత మాస్టర్ పీస్ అర్జున్ రెడ్డితో సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఈ ఒక్క చిత్రంతో విజయ్ దేవరకొండకు మాస్ ఫాలోయింగ్ తో పాటు యూత్ ఫాలోయింగ్, అమ్మాయిల్లోనూ మంచి క్రేజ్ దక్కించుకున్నారు. ఆ తర్వాత ఒక్క గీతా గోవిందంతో మాత్రమే హిట్ అందుకున్నారు. ఆ తర్వాత ఆశించిన ఫలితం అందలేదు. కానీ సినిమా సినిమాకు ఫ్యాన్స్ పెరుగుతూనే వస్తున్నారు గానీ, ఏమాత్రం తగ్గడం లేదు.

Vijay Deverakonda Fitness Challenge Video Goes Viral

విజయ్ కింగ్డమ్..
అర్జున్ రెడ్డి చిత్రంతో సెట్ చేసిన రికార్డ్ ను కింగ్డమ్ చిత్రంతో బ్రేక్ చేయాలని, తన ఫ్యాన్స్ తో అర్జున్ రెడ్డిని మరిచిపోయి మరో సాలిడ్ చిత్రాన్ని అందించాలని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో కింగ్డమ్ తో మంచి సక్సెస్ అందుకుంటారని అభిమానులు ఆశిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే చిత్రం నుంచి వస్తున్న అప్డేట్స్ కు మంచి రెస్పాన్స్ దక్కుతుంది. కింగ్డమ్ చిత్రం విడుదల తర్వాత విజయ్ రేంజ్ మరింతగా పెరుగుతుందని అంటున్నారు.

విజయ్ దేవరకొండ షాకింగ్ వీడియో..
విజయ్ దేవరకొండ ఫిట్ నెస్ విషయంలో ఎంత శ్రద్ధ వహిస్తారో తెలిసిందే. ఎప్పుడూ ఫిట్ గా కనిపిస్తూ హెల్త్, ఫిట్‌నెస్ పై అభిమానులు, నెటిజనుల్లో స్ఫూర్తిని నింపుతుంటారు. అయితే విజయ్ దేవరకొండకు సంబంధించి ఓ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ఆ వీడియోలో విజయ్ ఎలాంటి సపోర్ట్ లేకుండా రెండు వాల్స్ కు తన కాళ్లని బలంగా నొక్కి పడుతూ పైకి జంప్ చేస్తూ రెండు అంతస్తులు ఎక్కాడు. విజయ్ ఎక్కిన తీరు ఆయన ఫిట్ నెస్ కు నిదర్శనంగా మారింది.

ఈ ఒక్క వీడియోతో విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమా కోసం ఎంత కష్టపడ్డారో అనేది ఇట్టే అర్థమవుతుందని అభిమానులు అంటున్నారు. అయితే ఆ వీడియో ఎలా లీకైంది? ఎవరు పోస్ట్ చేశారనేది స్పష్టం లేదు. మరికొందరు నిజంగా విజయ్ దేవరకొండనేనా అని కూడా సందేహిస్తున్నారు. ఏదేమైనా రౌడీ హీరో పేరు నెట్టింట హాట్ టాపిక్ గ్గా మారింది. కింగ్డమ్ చిత్రంపై జజ్ క్రియేట్ అయ్యింది. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది. గౌతమ్ తిన్ననూరి దర్శకుడు, నాగ వంశీ నిర్మాతగా వ్యవహరించారు. జూలై 31న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X