బిగ్‌బాస్3 హోస్ట్‌గా విజయ్ దేవరకొండ.. క్రేజీ న్యూస్ వైరల్!
Recommended Video

టాలీవుడ్‌లో ప్రస్తుతం విజయ్ దేవరకొండ క్రేజ్ పరుగులు పెడుతున్నది. ఎవడే సుబ్రహ్మణ్యం, పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం చిత్రాల్లో నటించి కెరీర్‌లో వరుసగా నాలుగో హిట్‌ను సొంతం చేసుకొన్న సంగతి తెలిసిందే. విలక్షణమైన, విభిన్నమైన నటనతో దూసుకెళ్తున్న ఈ హీరోపై దక్షిణాది సినిమా పరిశ్రమ కన్నేసింది. కెరీర్ ఆరంభంలోనే భారీ ఆఫర్లను అందుకొంటున్న ఈ యువ హీరోకు మరో అరుదైన ఆఫర్ అందుకొన్నట్టు ఓ వార్త మీడియాలో వైరల్‌గా మారింది. అదేమిటంటే..

బిగ్‌బాస్1 షోకు హోస్ట్‌గా
తెలుగులో బిగ్‌బాస్ రియాలిటీ షోకు బుల్లితెర ప్రేక్షకుల్లో అనూహ్యమైన స్పందన వస్తున్నది. మొదటి సీజన్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించి ఈ షోను మరోస్థాయికి తీసుకెళ్లాడు. షూటింగ్‌ల బిజీ కారణంగా ఎన్టీఆర్ రెండో సీజన్‌కు దూరం కావడంతో ఆ బాధ్యతను నేచురల్ స్టార్ నాని భుజాన ఎత్తుకొన్నాడు.

బిగ్‌బాస్ రెండో సీజన్ మహా రంజుగా
హీరో నాని హోస్ట్‌గా బిగ్‌బాస్ రియాలిటీ షో రంజుగా సాగుతున్నది. ఈ కార్యక్రమానికి భారీగా స్పందన రావడంతో టెలివిజన్ రేటింగ్స్ కూడా అమాంతం పెరిగిపోయాయి. ఆసక్తికరమైన సంఘటనలతో ముందుకెళ్తున్నది. అయితే రెండో సీజన్‌కు కార్యక్రమ నిర్వాహకులు మొదట విజయ్ దేవరకొండను సంప్రదించారట.

బిగ్‌బాస్ హోస్ట్‌గా ఆఫర్
బిగ్‌బాస్ హోస్ట్‌గా చేయమని విజయ్ దేవరకొండతో స్టార్ మా నిర్వాహకులు చర్చలు జరిపారట. ఆ సమయంలో గీత గోవిందం, టాక్సీవాలా షూటింగ్ దశలో ఉండటం, అలాగే తమిళ, తెలుగులో నోటా సినిమా కూడా అంగీకరించాల్సి ఉండటంతో ఆ ఆఫర్‌ను విజయ్ నిరాకరించారట. కానీ మూడో సీజన్ చేయడానికి ఒప్పుకొన్నట్టు ఓ వార్త ప్రచారంలో ఉంది.

బిగ్‌బాస్3కి ఒకేనట
బిగ్‌బాస్ మూడో సీజన్‌కు విజయ్ దేవరకొండ హోస్ట్‌గా వస్తే ఆ రియాలిటీ షోకు మరింత క్రేజ్ ఏర్పడే అవకాశం ఉందనే అభిప్రాయాన్ని సినీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ఒకవేళ ఈ వార్త నిజమైతే విజయ్ దేవరకొండ ప్రతీ ఇంటి సభ్యుడికి బుల్లితెర ద్వారా చేరువయ్యే అవకాశం లేకపోలేదు.

సక్సెస్ జోష్‌లో విజయ్ దేవరకొండ
ప్రస్తుతం విజయ్ దేవరకొండ నటించిన గీత గోవిందం చిత్రం ఘన విజయం వైపు దూసుకెళ్తున్నది. ఇప్పటికే రూ.50 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. ఇదే ఊపు కొనసాగితే రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించడానికి స్కోప్ ఉంది.


Click it and Unblock the Notifications











