Kingdom Remuneration: వరుసగా ఫ్లాప్స్ ఉన్నా.. కింగ్డమ్ కు విజయ్ దేవరకొండ భారీ రెమ్యునరేషన్.. ఎన్ని కోట్లంటే?

స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ ఫిల్మ్ కింగ్డమ్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ జూలై 31న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ప్రస్తుతం సినిమాకు పాజిటివ్ రివ్యూస్ అందుతుంటం విశేషం. అయితే విజయ్ దేవరకొండకు గత చిత్రాలతో పెద్దగా ఆశించిన ఫలితం అందలేదు. దీంతో కింగ్డమ్ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు. అయితే రీసెంట్ హిట్స్ లేకున్నా విజయ్ దేవరకొండ కింగ్డమ్ చిత్రానికి తీసుకున్న పారితోషికం భారీగానే ఉండటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

కింగ్డమ్ చిత్రం బడ్జెట్..
ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ను టాలీవుడ్ ప్రముఖ నిర్మాత నాగ వంశీ నిర్మించారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్, శ్రీకర స్టూడియోస్, ఫార్యూన్ ఫర్ సినిమాస్ బ్యానర్లలో ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మించారు. మూవీకి స్టార్ కాస్ట్ నటించడం, టాప్ టెక్నీషియన్లతో పనిచేయించడం, ప్రమోషన్స్ ను కూడా గ్రాండ్ గా నిర్వహించడంతో భారీగానే ఖర్చైందని తెలుస్తోంది. మొత్తంగా కింగ్డమ్ సినిమా థియేటర్లలోకి వచ్చే వరకు 130 కోట్ల రూపాయాలు పెట్టుబడి అయ్యిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Vijay Deverakonda Huge Remuneration for Kingdom Movie

కెరీర్ లోనే హయ్యెస్ట్ రెమ్యునరేషన్..
విజయ్ దేవరకొండ కెరీర్ లో ఇప్పటి వరకు హయ్యేస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్న చిత్రం కింగ్డమ్ అనే అంటున్నారు సినీ విశ్లేషకులు. ఈ మేరకు స్ట్రాంగ్ గా ప్రచారం కూడా జరుగుతోంది. ఈ క్రమంలో విజయ్ దేవరకొండ కింగ్డమ్ చిత్రం కోసం దాదాపు 2 ఏళ్లుగా కష్ట పడుతున్నారు. మరో చిత్రంపై ఫోకస్ పెట్టకుండా కేవలం కింగ్డమ్ తో సాలిడ్ హిట్ అందుకోవాలని టైమ్ కేటాయించారు. ఇందుకు గాను విజయ్ 30 కోట్ల రూపాయలు చార్జీ చేశారని తెలుస్తోంది. లైగర్ కు 20 కోట్లు రూపాయలు తీసుకున్నారని టాక్. ఇక ఇప్పటి వరకు ఇదే అత్యధిక పారితోషికం అని తెలుస్తోంది.

డైరెక్టర్, హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్ సాలరీలు..
ఇక ఈ చిత్రాన్ని డైరెక్టర్ చేసిన క్రియేటివ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి కూడా భారీగానే ఛార్జ్ చేశారు. కింగ్డమ్ ప్రాజెక్ట్ కు 7 కోట్ల రూపాయలు తీసుకున్నారు. ఇక కీలక పాత్రలో నటించిన సత్యదేవ్ రూ.3 కోట్లు అందుకున్నారు. హీరోయిన్ గా ఆకట్టుకుంటున్న భాగ్యశ్రీ బోర్సే 1 కోటీ రూపాయలు పారితోషికం అందుకుంది. మరోవైపు టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్ర 10 కోట్ల రూపాయలు ఛార్జి చేసినట్టు ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు.

కింగ్డమ్ ప్రీ రిలీజ్ బిజినెస్..
కింగ్డమ్ చిత్రానికి మొదటి నుంచి హైప్ పెరుగుతూనే వచ్చింది. ఇక మేకర్స్ బ్యాక్ టు బ్యాక్ విడుదల చేసిన అప్డేట్స్ కూడా సినిమాపై అంచనాలు పెంచాయి. మరోవైపు విజయ్ దేవరకొండ, నాగ వంశీ, గౌతమ్ తిన్ననూరి, అనిరుధ్ రవిచంద్ర వంటి ప్రముఖులు ఈ చిత్రానికి పనిచేయడంతో సినిమాకు మంచి ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది. వరల్డ్ వైడ్ గా రూ.110 కోట్ల వరకు ప్రీరిలీజ్ వ్యాపారం జరిగిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక బాక్సాఫీస్ వద్ద ఓపెనింగ్ కలెక్షన్స్ ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X