For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  JGM: విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు మరో షాక్.. జనగణమనపై పూరీ జగన్నాథ్ సంచలన నిర్ణయం

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా తక్కువ సమయంలోనే స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్న హీరోల్లో క్రేజీ గాయ్ విజయ్ దేవరకొండ ఒకడు. ఆరంభంలోనే ఎన్నో విజయాలను సొంతం చేసుకున్న అతడు.. రెట్టించిన ఉత్సాహంతో సినిమాల మీద సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 'లైగర్' అనే మూవీలో నటించాడు.

  ఇది విడుదల కాకముందే అదే దర్శకుడితో 'జన గణ మన' అనే చిత్రాన్ని కూడా పట్టాలెక్కించేశాడు. అయితే, ఇప్పుడు 'లైగర్' మూవీ ఫలితంతో అటు విజయ్, ఇటు పూరీ జగన్నాథ్‌కు బిగ్ షాక్ తగిలింది. ఈ నేపథ్యంలో వీళ్ల కాంబోలో మొదలు పెట్టిన 'జన గణ మన' మూవీపై వీళ్లిద్దరూ సంచలన నిర్ణయం తీసుకున్నారట. అసలేం జరిగిందో మీరే చూడండి!

   లైగర్‌తో పాన్ ఇండియా టార్గెట్

  లైగర్‌తో పాన్ ఇండియా టార్గెట్

  టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ.. డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కలయికలో వచ్చిన చిత్రమే 'లైగర్'. ఇందులో విజయ్ సరసన అనన్య పాండే నటించింది. పూరీ, చార్మీలతో కలిసి కరణ్ జోహార్ దీన్ని నిర్మించారు. ఇందులో మైక్ టైసన్, రమ్యకృష్ణ కీలక పాత్రలను పోషించారు. పాన్ ఇండియా రేంజ్‌లో ఈ సినిమా ఐదు భాషల్లో ఎంతో గ్రాండ్‌గా రిలీజైన విషయం తెలిసిందే.

  వేణు మాధవ్ మరణంపై పెదవి విప్పిన కొడుకులు: ఆయనకు గర్ల్‌ఫ్రెండ్ ఎక్కువ.. అదే ప్రాణం తీసిందంటూ!

  లైగర్ మూవీతో కోలుకోలేని షాక్

  లైగర్ మూవీతో కోలుకోలేని షాక్

  క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'లైగర్' మూవీకి అన్ని భాషల్లోనూ నెగెటివ్ టాక్ వచ్చింది. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ చిత్రానికి దారుణమైన పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా దీనికి ఎక్కడా కలెక్షన్లు ఆశించిన స్థాయిలో రావడం లేదు. దీంతో ఈ చిత్రం భారీ నష్టాల దిశగా సాగుతోంది. దీనివల్ల విజయ్, పూరీకి కోలుకోలేని షాక్ తగిలినట్లైంది.

   మహేశ్ కథతోనే విజయ్ మూవీ

  మహేశ్ కథతోనే విజయ్ మూవీ


  సూపర్ స్టార్ మహేశ్ బాబుతో పూరీ జగన్నాథ్ గతంలో 'పోకిరి', 'బిజినెస్‌మ్యాన్' వంటి సూపర్ డూపర్ హిట్లు తెరకెక్కించాడ. వీటి తర్వాత వీళ్ల కాంబోలో 'జన గణ మన' అనే సినిమా ఉంటుందని ఎప్పుడో ప్రకటించారు. కానీ, ఇద్దరి మధ్యా దూరం పెరగడంతో అది కాస్తా పట్టాలెక్కలేదు. ఈ నేపథ్యంలో ఇటీవలే ఈ చిత్రాన్ని విజయ్ దేవరకొండతో ప్రారంభించాడు పూరీ.

  బట్టలు లేకుండా చరణ్ హీరోయిన్: ఆ పార్టును మాత్రమే చూపిస్తూ దారుణంగా!

  గ్రాండ్‌గా లాంచ్.. షెడ్యూల్‌లో

  గ్రాండ్‌గా లాంచ్.. షెడ్యూల్‌లో

  పూరీ జగన్నాథ్ - విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో రెండో సినిమా 'జన గణ మన'ను ప్రకటించిన చాలా తక్కువ రోజుల్లోనే దీన్ని పట్టాలెక్కించేశారు. ఇందుకోసం గ్రాండ్‌గా లాంచ్ ఈవెంట్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఆ వెంటనే ఓ షెడ్యూల్‌ను ప్రారంభించారు. ఇందులో కొన్ని కీలక సన్నివేశాలను కూడా చిత్రీకరించారు. దీంతో ఈ చిత్రం వచ్చే ఏడాది వస్తుందని వార్తలు వచ్చాయి.

  జన గణ మనపై అనుమానాలు

  జన గణ మనపై అనుమానాలు

  విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన 'లైగర్' మూవీ ఎన్నో అంచనాలతో వచ్చి పరాజయం పాలైంది. దీంతో వీళ్ల కాంబినేషన్‌లో రాబోతున్న రెండో సినిమా 'జన గణ మన'పై భారీ స్థాయిలో ప్రభావం పడుతుందని ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో ఇది ఆగిపోయే అవకాశాలు కూడా ఉన్నట్లు చాలా వార్తలు వైరల్ అవుతున్నాయి.

  యాంకర్ రష్మీ అందాల ఆరబోత: స్లీవ్‌లెస్ బ్లౌజ్‌తో ఊహించని హాట్ షో

  సినిమా ఆగిపోతుందని న్యూస్

  సినిమా ఆగిపోతుందని న్యూస్

  పూరీ జగన్నాథ్ - విజయ్ దేవరకొండ కలయికలో రాబోతున్న 'జన గణ మన' మూవీని అర్థాంతరంగా ఆపేస్తున్నట్లు తాజాగా ఓ న్యూస్ లీకైంది. ఇటీవలే వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'లైగర్' ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో అటు పూరీ, ఇటు విజయ్ చాలా చర్చలు జరిపిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతుందట.

  మార్కెట్ ఇష్యూనే కారణమట

  మార్కెట్ ఇష్యూనే కారణమట

  ఎన్నో అంచనాలతో విడుదలైన 'లైగర్' మూవీ ఘోరంగా పరాజయం పాలైంది. దీంతో చిత్ర యూనిట్‌కు చాలా నష్టాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు 'జన గణ మన' చేస్తే దాని మార్కెట్‌పైనా భారీగా ప్రభావం పడే అవకాశం ఉందని కొందరు నిపుణులు పూరీ జగన్నాథ్‌కు సలహాలు ఇచ్చారట. దీంతో విజయ్‌తో మాట్లాడి ఈ చిత్రాన్ని ఆపేయాలని డిసైడ్ అయ్యారని టాక్.

  English summary
  Puri Jagannadh Doing Jana Gana Mana Movie With Vijay Deverakonda. Now This Movie Shelved Because of Liger Movie Result.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X