విజయ్ దేవరకొండకు జోడీగా మహేష్ బాబు బ్యూటీ! ఇది రష్మిక మందన్నా ప్లానింగా ?

టాలీవుడ్‌లో మరో ఓ క్రేజీ కాంబినేషన్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)హీరోగా, 'హాయ్ నాన్న' ఫేమ్ శౌర్యువ్ (Shouryuv) దర్శకత్వంలో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌కు తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ మూవీని మైథలాజికల్ టచ్‌తో కూడిన డార్క్ రివేంజ్ యాక్షన్ డ్రామాగా రూపొందించేందుకు మేకర్స్ భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి హీరోయిన్ ఎంపికపై ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్, మహేష్ బ్యూటీ హీరోయిన్‌గా నటించనున్నారట . ఇంతకీ హీరోయిన్ ఎవరు?

విజయ్ దేవరకొండ- శౌర్యువ్ కాంబోలో రాబోతున్న మూవీకి డార్క్ రివేంజ్ యాక్షన్ డ్రామాగా రూపొందించేందుకు మేకర్స్ భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా హాలీవుడ్‌కు చెందిన టెక్నికల్ టీమ్‌ను కూడా రంగంలోకి దింపాలని ప్లాన్ చేయడం ఈ ప్రాజెక్ట్ స్థాయిని స్పష్టంగా తెలియజేస్తోంది. ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తి కాగా, ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి. విజువల్‌గా గ్రాండ్‌గా, అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ సినిమాను తెరకెక్కించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం.

Vijay Deverakonda Kriti Sanon Pair Up in Shouryuv s Pan-India Action Epic Buzz

ఇక హీరోయిన్ ఎంపిక విషయంలో మేకర్స్ స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఇటు సౌత్, అటు నార్త్ ప్రేక్షకుల్నిఆకట్టుకునే ఫేస్ కోసం వెతుకుతున్న తెలుస్తుంది. ఈ క్రమంలో పలు హీరోయిన్ పేరు పరిశీలించారట. ఇక చివరికి కృతి సనన్ పేరు ఫైనల్ స్టేజ్‌కు చేరిందని టాక్. కృతి సనన్ కెరీర్ తెలుగు సినిమాతోనే ప్రారంభమైంది. సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటించిన '1: నేనొక్కడినే' సినిమాతో ఆమె సినీ ప్రస్థానం మొదలైంది. ఆ తరువాత బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన కృతి, ఇప్పుడు మళ్లీ టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వబోతుందన్న వార్తలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

ఈ కాంబినేషన్ సెట్ కావడం వెనుక ఓ ఇంట్రెస్టింగ్ అంశం ఉందట. ముఖ్యంగా నేషనల్ క్రష్ రష్మిక మందాన్న (Rashmika Mandanna) రికమండేషన్‌తోనే కృతి సనన్ పేరు మేకర్స్ దృష్టికి వచ్చిందని టాక్. ప్రస్తుతం రష్మిక, కృతి కలిసి ఒక బాలీవుడ్ ప్రాజెక్ట్‌లో నటిస్తుండగా, ఆ సమయంలో ఏర్పడిన స్నేహం కారణంగా ఈ సూచన వచ్చిందని చెబుతున్నారు. అయితే, ఈ విషయం పై ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు.

ఇక టెక్నికల్‌గా కూడా ఈ సినిమా స్ట్రాంగ్ గా ఉండబోతోందట. హాలీవుడ్ VFX నిపుణులు, ఇంటర్నేషనల్ సినిమాటోగ్రాఫర్స్, టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఈ ప్రాజెక్ట్‌లో భాగమవుతుండటంతో, ఇది గ్లోబల్ లెవల్‌లో ప్రెజెంట్ చేయాలనే లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించనున్నారని సమాచారం.

సోషల్ మీడియాలో ఈ కాంబినేషన్‌పై మిశ్రమ స్పందన కనిపిస్తోంది. కొందరు విజయ్-కృతి జోడీ కొత్తగా, ఫ్రెష్‌గా ఉంటుందని భావిస్తుంటే, మరికొందరు మాత్రం ఈ జంట స్క్రీన్‌పై ఎలా కనిపిస్తుందో చూడాలంటున్నారు. ఏదేమైనా, అధికారిక ప్రకటన వచ్చేవరకు ఈ వార్తలను గాసిప్‌లుగానే పరిగణించాల్సి ఉంటుంది. ఒకవేళ కృతి సనన్ ఈ సినిమాలో ఫైనల్ అయితే, ఈ కాంబినేషన్ ఖచ్చితంగా పాన్ ఇండియా లెవెల్‌లో మరింత హైప్ తీసుకురావడం ఖాయం. అధికారిక అనౌన్స్‌మెంట్ ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఇప్పుడు ఒక్కటే ఎదురుచూస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X