Kushi: అప్పుడు పవన్ - భూమిక.. ఇప్పుడు విజయ్ - సమంత.. సేమ్ టూ సేమ్ అబ్బా!

బ్యాగ్రౌండ్ లేకుండానే సినిమాల్లోకి వచ్చినా.. తనకంటూ ప్రత్యేకమైన ముద్రను వేసుకుని చాలా తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయాడు క్రేజీ గాయ్ విజయ్ దేవరకొండ. దీనికితోడు ఆరంభంలోనే ఎన్నో విజయాలను సొంతం చేసుకున్న అతడు.. మార్కెట్‌ను, క్రేజ్‌ను భారీగా పెంచుకున్నాడు. ఈ ఉత్సాహంతోనే వరుసగా సినిమాలు చేస్తోన్నాడు. అయితే, ఈ మధ్యనే విజయ్‌కు 'లైగర్' చిత్రంతో భారీ ఎదురు దెబ్బ తగిలింది. దీని నుంచి కోలుకునేందుకు అతడు ఇప్పుడు 'ఖుషి' అనే ఫీల్ గుడ్ రొమాంటిక్ మూవీలో నటిస్తోన్న విషయం తెలిసిందే.

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ - స్టార్ హీరోయిన్ సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రమే 'ఖుషి'. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ చాలా వరకు పూర్తైంది. అలాగే, ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు.

Vijay Deverakonda Samantha Kushi

దీనికి అన్ని వర్గాల వాళ్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. అదే సమయంలో సినిమాపై అంచనాలు కూడా రెట్టింపు అయ్యాయి. కానీ, కొంత కాలంగా ఈ మూవీ షూటింగ్ నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో ఇటీవలే ఓ షెడ్యూల్‌ను పూర్తి చేశారు. ఇక, తాజాగా ఈ చిత్రం నుంచి ఓ క్రేజీ న్యూస్ లీకైంది.

మంచి లవ్ స్టోరీతో రూపొందుతోన్న ఈ మూవీకి 'ఖుషి' అనే టైటిల్ పెట్టడంతోనే అందరి దృష్టినీ ఆకర్షించింది. దీంతో అప్పట్లో పవన్ నటించిన 'ఖుషి'కి దీనికి ఏదైనా లింక్ ఉందా అని అందరూ చర్చించుకున్నారు. అందుకు అనుగుణంగానే తాజాగా దీని నుంచి ఓ న్యూస్ లీకైంది.

దీని ప్రకారం.. అందులో పవన్ - భూమిక మధ్య ఇగో ఉన్నట్లుగానే ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ - సమంత పాత్రల మధ్య కూడా ఉంటుందట. అలా వీళ్లిద్దరి మధ్య వచ్చిన గొడవలతో ఎలాంటి సమస్యలు వచ్చాయి అనే అంశంతోనే ఈ సినిమా వస్తున్నట్లు తాజాగా తెలిసింది. దీంతో ఈ మూవీపై ఆసక్తి పెరిగిపోతోంది.

Vijay Deverakonda Samantha Kushi

'ఖుషి' మూవీని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యేర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. దీనికి హిషామ్ అబ్దుల్ వాహబ్ సంగీతాన్ని ఇస్తున్నారు. జయరాం, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, రోహిణి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య తదితరులు కీలక పాత్రలను చేస్తున్నారు. ఈ మూవీని సెప్టెంబర్ 1న విడుదల చేయనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X