రష్మికతో విజయ్ దేవరకొండ పెళ్లి.. వెడ్డింగ్ కార్డ్ అందుకొన్న ఫస్ట్ సెలబ్రిటీ ఎవరో తెలుసా?
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అందరి మెదళ్లను తొలిచి వేస్తోన్న పజిల్‌గ మారిన ఇష్యూ ఏదైనా ఉందంటే.. అది విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న పెళ్లి టాపిక్కే. వీరిద్దరూ తమ స్నేహం, రిలేషన్, ఎంగేజ్‌మెంట్, ఇప్పుడు పెళ్లి వరకు అంతా సీక్రెట్‌గా ఉంచడమే ఇందుకు కారణం. అసలు రష్మిక - విజయ్‌లు పెళ్లి చేసుకోబోతున్నారా? లేదా? అంటూ జనం జుట్టు పీక్కుంటున్నారు. ఈ దశలో మన రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ చేసిన పని కొత్త అనుమానాలకు తావిచ్చింది. ఈ వివరాల్లోకి వెళితే..
గత కొన్నేళ్లుగా విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నలు సీక్రెట్‌గా డేటింగ్‌లో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. గతేడాది ఏకంగా ఎంగేజ్‌మెంట్ కూడా జరిగిపోయినట్లుగా గాసిప్స్ వైరల్ అయ్యాయి. కానీ ఎక్కడా వీరిద్దరూ అధికారికంగా ఈ విషయాన్ని బయటపెట్టలేదు. కానీ మీడియాలో మాత్రం వీరిద్దరి పెళ్లి డేట్, దానికి సంబంధించిన ఏర్పాట్ల గురించి రకరకాల కథనాలు వైరల్ అవుతున్నాయి. ఇంత జరుగుతున్నా విజయ్ - రష్మిక కుటుంబ సభ్యులు కానీ, సన్నిహితులు కానీ ఏమాత్రం స్పందించడం లేదు.

గీత గోవిందం సినిమాలో తొలిసారిగా విజయ్ దేవరకొండ- రష్మిక మందన్న కలిసి నటించారు. ఈ సినిమా షూటింగ్ టైంలోనే వీరిద్దరి మధ్య స్నేహం మొదలై, ప్రేమగా మారిందని మీడియా కోడై కూసింది. ఆ తర్వాత విజయ్, రష్మికలు సీక్రెట్‌గా డేట్స్, పార్టీలు, విహారయాత్రలకు వెళ్లేవారు. వీరు సోషల్ మీడియాలో వదిలిన ఫోటోలలోని బ్యాక్‌గ్రౌండ్స్ ఒకేలా ఉండటంతో ఈ రూమర్స్‌కి మరింత బలం చేకూరినట్లయ్యింది. పలుమార్లు ఎయిర్‌పోర్ట్స్, రెస్టారెంట్స్‌లో సన్నిహితంగా మెలుగుతూ మీడియా కెమెరాలకు చిక్కారు. అయినప్పటికీ విజయ్ కానీ, రష్మిక కానీ తమ బంధాన్ని ఎక్కడా బయటపెట్టలేదు. ఈ దశలో గతేడాది అక్టోబర్‌లో ఈ జంట సీక్రెట్‌గా నిశ్చితార్ధం చేసుకుందని ఫిలింనగర్‌లో జోరుగా ప్రచారం జరిగింది. అప్పుడు కూడా విజయ్- రష్మికలు బయటపడలేదు.
మరోవైపు.. విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నల వివాహం ఎప్పుడు? ఎక్కడ? అన్న దానిపైనా మీడియాలో రకరకాల వదంతులు వచ్చాయి. ఫిబ్రవరి 26న రాజస్తాన్‌లోని ప్రఖ్యాత ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో వీరి వివాహం జరగనుంది అన్నది ఆ వార్తల సారాంశం. ఇరు కుటుంబాలు, అత్యంత సన్నిహితుల సమక్షంలో సింపుల్‌గా పెళ్లి చేసుకోవాలని ఈ జంట నిర్ణయించుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. రాజస్థాన్‌లో పెళ్లి జరిగినా.. హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించే యోచనలో ఉందని ఫిలింనగర్‌లో చర్చ జరుగుతోంది. పెళ్లి డేట్ దగ్గర పడుతున్నా.. విజయ్ - రష్మికలు మౌనంగానే ఉన్నారు, ఎవరి పనుల్లో వారే ఉన్నారు.
అయితే విజయ్ రష్మికలు ఎంగేజ్‌మెంట్ మాదిరిగానే సీక్రెట్‌గా పెళ్లి చేసుకుని ఫోటోలు రిలీజ్ చేస్తారా అంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ఈ దశలో విజయ్ దేవరకొండ షాకిచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విజయ్ కలిశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇంత అర్జెంట్‌గా అది కూడా సీఎం నివాసంలో.. ముఖ్యమంత్రిని ఎందుకు కలవాల్సి వచ్చింది? అనేది హాట్ టాపిక్‌గా మారింది. ఆయన సినిమాల గురించి కలవడానికి.. విజయ్ సినిమాలన్నీ సెట్స్ మీదే ఉన్నాయి. ప్రత్యేకించి మరే కారణాలు కూడా లేవు. దాంతో ఖచ్చితంగా పెళ్లికి ఆహ్వానించడానికే రేవంత్ రెడ్డిని విజయ్ కలిసుంటారని మెజారిటీ సినీ జనాలు భావిస్తున్నారు.
అదే నిజమైతే విజయ్ - రష్మికలు పెళ్లి పిలుపులు మొదలేట్టిసినట్లే. వారి పెళ్లి శుభలేఖను అందుకున్న మొదటి సెలబ్రిటి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డే. దీనిని బట్టి ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో జరగడం ఖాయంగానే కనిపిస్తోంది. ఫిబ్రవరి 20 నాటికి ఇరు కుటుంబాలు ఉదయ్‌పూర్‌కు చేరుకుని.. 22వ తేదీ నుంచి హల్దీ, మెహందీ, సంగీత్ లాంటి వేడుకల్లో పాల్గొంటారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 26వ తేదీన పెళ్లి చేసుకుని.. హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత మార్చి తొలివారంలో సినీ, రాజకీయ, ఇతర ప్రముఖులకు గ్రాండ్ రిసెప్షన్ ఇవ్వాలని విజయ్ - రష్మికలు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











