విజయ్ దేవరకొండ నెక్ట్స్.. లైఫ్ ఇచ్చిన డైరెక్టర్ తో మరోసారి.. టైటిల్ ఫిక్స్?
టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ తన రాబోయే చిత్రంతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నారు. గత చిత్రాలతో అంతంత మాత్రమే సక్సెస్ ను అందుకు రౌడీ స్టార్ మరికొద్ది రోజుల్లో రాబోతున్న యాక్షన్ స్పైథ్రిల్లర్ చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ ఎవరితో సినిమా చేస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో తాజాగా తన ఫేవరెట్ డైరెక్టర్ కు అవకాశం ఇచ్చినట్టు ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. ఆ వివరాల్లోకి వెళ్లితే...
విజయ్ దేవరకొండ గత 5 చిత్రాలు..
స్టార్ హీరో విజయ్ దేవరకొండ తన గత చిత్రాలతో ఆశించిన ఫలితాన్ని అందుకోలేక పోయాడు. ఈ క్రమంలో చివరి 5 చిత్రాలు.. వాటి ఫలితాలు గమనిస్తే ఇలా ఉన్నాయి. 2019లో విజయ్ నుంచి వచ్చిన 'డియర్ కామ్రేడ్' చిత్రం మిశ్రమ స్పందనను అందుకుంది. వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్ చిత్రాలైతే భారీ పరాజయాన్ని మిగిల్చాయి. ఇక ఆ తర్వాత వచ్చిన 'ఖుషి' కాస్తా పాజిటివ్ టాక్స్ ను అందుకుని విజయ్ కు రిలాక్స్ నిచ్చాయి. ఇక చివరిగా 'ది ఫ్యామిలీ స్టార్'తో అలరించారు. ఈ చిత్రం కమర్షియల్ గా ఫెయిల్ అయ్యింది.

విజయ్ దేవరకొండ 'కింగ్డమ్' సినిమా..
టాలీవుడ్ లో స్పూ థ్రిల్లర్ గా రూపుదిద్దుకుంటున్న చిత్రమే 'కింగ్డమ్'. జెర్సీ లాంటి బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు గౌతమ్ తిన్ననూని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ దేవరకొండ - భాగ్యశ్రీ బోర్స్లే జంటగా నటిస్తున్నారు. టాలెంటెడ్ హీరో సత్యదేవ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. సితారా ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చూన్ ఫోర్ క్రియేషన్స్ బ్యానర్ లో రూ.110 కోట్ల బడ్జెట్ తో భారీగా నిర్మిస్తున్నారు. మే 30న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అనిరుధ్ రవిచంద్ర సంగీతం అందిస్తున్నారు.
మరోసారి విజయ్ దేవరకొండ తరుణ్ భాస్కర్..
తరుణ్ భాస్కర్.. తన మొదటి సినిమా 'పెళ్లి చూపుల'తోనే నేషనల్ అవార్డును సొంతం చేసుకున్నారు. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ - రీతూ వర్మ జంటగా నటించారు. 2016లో ఈ సినిమా విడుదలై బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకుంది. ఈ సినిమా తర్వాతనే విజయ్ దేవరకొండ కెరీయర్ మలుపు తిరిగింది. ఆ తర్వాత వీరిద్దరి కాంబోలో మళ్లీ సినిమా రాలేదు. ఇక ప్రస్తుతం మరోసారి ఈ సక్సెస్ కాంబినేషన్ ను రిపీట్ చేయబోతున్నారని తెలుస్తోంది. తరుణ్ భాస్కర్ - విజయ్ దేవరకొండ కాంబోలోని సినిమాకు 'బినామీ' అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారని తెలుస్తోంది. ఇక ఈ చిత్రాన్ని టాలీవుడ్ అగ్ర దర్శకుడు అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించబోతున్నట్టు తెలుస్తోంది.
విజయ్ ఆశలన్నీ ఆయనపైనే..
విజయ్ దేవరకొండ కెరీయర్ లో సక్సెస్ అందుకున్న చిత్రాలు కేవలం మూడే. పెళ్లి చేపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం. ఆ తర్వాత మిగితా సినిమాలు ఆశించిన మేర ఫలితానివ్వలేదు. దీంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని విజయ్ దేవరకొండ పట్టుదలతో ఉన్నారు. దీంతో దర్శకుడిగా సక్సెస్ అయిన గౌతమ్ తిన్ననూరిపైనే ఆశలు పెట్టుకున్న ఆ దర్శకత్వంలో రిలీజ్ కాబోతున్న 'కింగ్డమ్' ఎలాంటి ఫలితానిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications











