కొత్త ఇంటికి చేరిన విజయ్ దేవరకొండ.. మకాం మార్చేశాడట!

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ వేస్తున్న అడుగులు వావ్ అనిపిస్తున్నాయి. ఓ వైపు సినిమాల్లో తన టాలెంట్ నిరూపిస్తూనే మరోవైపు బిజినెస్, పర్సనల్ విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు ఈ యంగ్ హీరో. తాజాగా ఈ హీరో కొత్త ఇల్లు కొనేశాడని, అక్కడికే మకాం మార్చేశాడని ఫిలిం నగర్ టాక్. ఇంతకీ ఆయన కొన్న ఇల్లు ఏ ఏరియాలో ఉంది? వివరాల్లోకి పోతే..

శ్రీకాంత్ ఇంటికి సమీపంలో విజయ్ దేవరకొండ

శ్రీకాంత్ ఇంటికి సమీపంలో విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ ఫిల్మ్‌నగర్‌లో కొత్త ఇంటిని కొనుగోలు చేసినట్టు తెలిసింది. హీరో శ్రీకాంత్ ఇంటికి సమీపంలో నిర్మించిన ఇంటిని విజయ్ దేవరకొండ భారీ మొత్తం చెల్లించి కొనుగోలు చేశాడని సమాచారం. పైగా నిన్న (ఆదివారం) తన తల్లిదండ్రులు, సోదరుడితో కలిసి ఈ ఇంట్లోకి గృహప్రవేశం కూడా చేశాడని తెలుస్తోంది.

రౌడీ బ్రాండ్.. అన్ని కోణాల్లో విజయ్ ఆలోచనలు

రౌడీ బ్రాండ్.. అన్ని కోణాల్లో విజయ్ ఆలోచనలు

అర్జున్ రెడ్డి, గీత గోవిందం, టాక్సీవాలా లాంటి సినిమాలతో తన క్రేజ్ అమాంతం పెచుకున్న విజయ్ దేవరకొండ.. అన్నికోణాల్లో ఆలోచిస్తూ ముందడుగులేస్తున్నాడని స్పష్టంగా అర్థమవుతోంది. ఇప్పటికే బిజినెస్ రంగం లోకి ప్రవేశించిన ఈ యంగ్ హీరో రౌడీ బ్రాండ్ పేరిట దుస్తుల అమ్మకాలు ప్రారంభించి సక్సెస్ అయ్యాడు.

సొంతంగా నిర్మాణ సంస్థ.. మీకు మాత్రమే చెప్తా

సొంతంగా నిర్మాణ సంస్థ.. మీకు మాత్రమే చెప్తా

హీరోగా మెప్పిస్తూ పలు విజయాలు సొంతంగా చేసుకున్న విజయ్ దేవరకొండ.. సొంతంగా నిర్మాణ సంస్థ కూడా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఓన్ ప్రొడక్షన్ హౌస్‌ను స్థాపించి ‘మీకు మాత్రమే చెప్తా' సినిమాను నిర్మించాడు విజయ్. ఈ సినిమా ద్వారా అంతగా లాభాలు రాకపోయినా విజయ్ సేఫ్ జోన్ లో ఉన్నాడని తెలిసింది.

Recommended Video

#CineBox : Allu Arjun Is taking Huge Remuneration For Trivikram Srinivas's 'Ala Vaikuntapuramlo'?
వరల్డ్ ఫేమస్ లవర్.. విజయ్ దేవరకొండ

వరల్డ్ ఫేమస్ లవర్.. విజయ్ దేవరకొండ

ఇక విజయ్ దేవరకొండ సినిమాల విషయానికొస్తే.. ఇటీవలే డియర్ కామ్రేడ్ సినిమాతో కాస్త డీలా పడి ఇప్పుడు 'వరల్డ్ ఫేమస్ లవర్' రూపంలో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో విజయ్ సరసన రాశీ ఖన్నా, ఐశ్వర్య రాజేష్, కేథరిన్, ఇజాబెల్లా హీరోయిన్లుగా నటిస్తున్నారు. గోపీ సుందర్ సంగీతం సమకూరుస్తున్నారు. కె.ఎస్.రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై కె.ఎ.వల్లభ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X