Virosh Honeymoon: విజయ్- రష్మిక హ‌నీమూన్‌! ఎక్కడికి వెళ్లారంటే?

Virosh Honeymoon: విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న మూడు మూళ్ల బంధంతో ఒకటైన సంగతి తెలిసిందే. వీరిద్దరి వివాహం ఫిబ్రవరి 26వ తేదీ ఉదయ్ పూర్ లో ఎంతో అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఇక పెళ్లి తర్వాత వీళ్ళిద్దరికీ సంబంధించిన ఎన్నో ఫోటోలు వీడియోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. విజయ్ దేవరకొండ పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫోటోలను వీరిద్దరూ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా వీరికి సంబంధించిన ఓ ఫోటో తాజాగా ఇప్పుడూ వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటో ఏంటీ? ఇంతకీ ఆ మ్యాటరేంటీ?

టాలీవుడ్‌లో ఎప్పుడూ వార్తల్లో ఉండే వారిలో విజయ్- రష్మిక ముందుంటారు. వీరిద్దరి రిలేషన్‌పై గతంలో ఎన్నో ఊహాగానాలు వచ్చిన విషయం తెలిసిందే. వాటిన్నింటికి పుల్ స్టాప్ పెడుతూ వివాహబంధంతో ఒక్కటయ్యారు. అయితే.. తాజాగా వీరి పేర్లు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీరికి సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Vijay Deverakonda-Rashmika Honeymoon Buzz Thailand Trip Photos Go Viral

పలు మీడియా కథనాల ప్రకారం విజయ్-రష్మిక జంట పెళ్లి తర్వాత థాయ్‌లాండ్‌లో హనీమూన్ ఎంజాయ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా కో సముయి ప్రాంతంలో పచ్చని ప్రకృతి నడుమ, సముద్రతీరంలో వీరిద్దరూ గడుపుతున్నట్లు కొన్ని ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. ఒక ఫోటోలో రష్మిక, విజయ్‌ను హగ్ చేసుకుని ఉన్న సన్నివేశం అభిమానులను ఆకట్టుకుంటోంది.

ఈ ఫోటోలో ఇద్దరూ చాలా క్యూట్‌గా, రిలాక్స్ మూడ్‌లో కనిపించడం అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. రష్మిక ఫ్లోరల్ డ్రెస్సులో మెరిసిపోతుండగా, విజయ్ సింపుల్ క్యాజువల్ లుక్‌లో కనిపిస్తున్నారు. 'విరోష్' జంట మళ్లీ ట్రెండ్ అవుతూ, సోషల్ మీడియాలో అభిమానులు ఈ ఫోటోలను భారీగా షేర్ చేస్తున్నారు. హనీమూన్ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే.. ఇది రూమార్ అని కొంతమంది భావిస్తున్నారు. గతంలో కూడా వీరిద్దరి రిలేషన్‌పై ఎన్నో కథనాలు వచ్చిన నేపథ్యంలో, ఈ వార్తలపై స్పష్టత కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు.

ఇక సినిమా విషయానికి వస్తే, విజయ్ దేవరకొండ ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. మరోవైపు రష్మిక కూడా టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తోంది. ముఖ్యంగా ఈ జంట మళ్లీ కలిసి నటిస్తున్న 'రణబాలి' సినిమా ఇప్పటికే భారీ అంచనాలు పెంచింది. మొత్తంగా విజయ్-రష్మిక హనీమూన్ వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. అయితే ఇందులో ఎంత నిజం ఉంది? ఎంత రూమర్ ఉంది? అన్నది అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. అప్పటివరకు ఈ జంటపై వచ్చే ప్రతి అప్డేట్ కూడా వైరల్ అవుతూనే ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X