రెడ్ హ్యాండెడ్ గా దొరికిన విజయ్ - రష్మిక.. జంటగా ఎక్కడికి వెళ్లివస్తున్నారో తెలుసా?
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ ఇటీవల తెలంగాణ ఫిలిం గద్దర్ అవార్డ్స్ వేడుకల్లో కనిపించారు. అవార్డు అందుకొని ఈవెంట్లో సందడి చేశారు. ఇక ప్రస్తుతం తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు. అందుకు కారణం ఆయన ముంబై ఎయిర్ పోర్ట్ లో దర్శనం ఇవ్వడమే. అయితే ఒక్కడే ఎయిర్పోర్టులో కనిపిస్తే ఎందుకు ఇంత హడావుడి అనుకుంటున్నారేమో.. ఇక్కడే మరో మెలిక ఉంది. విజయ్ దేవరకొండ వెనకాలే నేషనల్ కృషి రష్మిక మందన్న కూడా ఎంట్రీ ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..
విజయ్ దేవరకొండ రష్మిక మందన్న సినిమాలు..
స్టార్ హీరో విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. పుష్ప చిత్రంతో రష్మిక మందన్న నేషన్ వైడ్ గా దుమ్ములేపిన సంగతి కూడా తెలిసిందే. ఇక వీరిద్దరూ కలిసి కూడా రెండు చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించిన సంగతి కూడా విధితమే. విజయ్ దేవరకొండ రష్మిక మందన్న కాంబినేషన్లో గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ వంటి చిత్రాలు వచ్చాయి. రెండు చిత్రాలతోనే వీరి ఆన్ స్క్రీన్ రొమాన్స్ ప్రేక్షకులకు ఎంతగానో నచ్చింది. మరోసారి వీరిద్దరూ వెండితెరపై ఎప్పుడు కలిసి నటించబోతున్నారని అభిమానులతో పాటు సాధారణ అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు.

కొన్నాళ్లుగా డేటింగ్ రూమర్లు..
ఆన్ స్క్రీన్ పై జంటగా చూసిన అభిమానులు విజయ్ దేవరకొండ రష్మిక మందనను నిజజీవితంలోనూ జంటగానే చూస్తున్నారు. అందుకు కారణం కూడా ఉంది. తరచుగా వీరిద్దరూ కలిసి టూర్లు, వెకేషన్లకు వెళ్తూ ఆ రూమర్లకు ప్రాణం పోస్తున్నారు. వీరిద్దరూ వెళ్తున్న టూర్ లకు సంబంధించిన లొకేషన్స్ ఒకే మాదిరిగా ఉండడం విశేషం. దీంతో వీరిద్దరూ కొన్నాళ్లుగా డేటింగ్ లోనే ఉన్నారంటూ రూమర్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. 5 ఏళ్లుగా విజయ్ దేవరకొండ రష్మిక మందన్న రిలేషన్ షిప్ పై రూమర్లు కొనసాగుతూనే ఉన్నాయి. ఆయన వారిద్దరు వీటిని ఖండించడం లేదు.
తాజాగా ముంబై ఎయిర్ పోర్టులో..
విజయ్ దేవరకొండ తాజాగా ముంబై ఎయిర్పోర్టులో దర్శనమిచ్చారు. ఆయన వెనకాలే స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న కూడా వచ్చింది. వీరిద్దరూ కలిసి ఒకే సమయంలో ఎయిర్పోర్టులో కనిపించడంతో మళ్లీ రూమర్లు మొదలయ్యాయి. వీరిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారని చెప్పడానికి ఇంతకన్నా ఆధారాలు ఇంకేం కావాలంటూ సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతోంది. అంతేకాదు వీరిద్దరూ ఒకే కారులో ప్రయాణించడం కూడా పెద్ద చర్చగా మారింది. దీంతో వారిద్దరికీ సంబంధించిన ఎయిర్పోర్టు వీడియోలు, ఫోటోలను తెగ వైరల్ చేస్తున్నారు. అయితే విజయ్ దేవరకొండ మాత్రం యాడ్ షూట్ కోసమని ముంబైకు వెళ్లారని తెలుస్తోంది.
విజయ్, రష్మికల రాబోయే చిత్రాలు..
రౌడీ హీరో విజయ్ దేవరకొండ నుంచి నెక్స్ట్ కింగ్డమ్ అనే చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రానికి గౌతం తిన్ననూరి దర్శకత్వం వహించారు. జూలై 4న ఈ చిత్రం గ్రాండ్ గా థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. ఇక రష్మిక మందన్న చివరిగా పుష్ప 2, చావా వంటి చిత్రాలతో భారీ విజయాన్ని అందుకుంది. జూన్ 20న కుబేర చిత్రంతో అలరించబోతోంది. ఇక ది గర్ల్ ఫ్రెండ్, థామ, కాక్ టెల్ 2 వంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.


Click it and Unblock the Notifications











