Vijay - Rashmika: విజయ్-రష్మికల పెళ్లి ఫిక్స్! ముహూర్తం ఎప్పుడు? పెళ్లి ఎక్కడంటే?
టాలీవుడ్‌లో మోస్ట్ లవ్‌బుల్ కపుల్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), రష్మిక మందన్న (Rashmika Mandanna). ఈ జంట గత కొంత కాలంగా తరుచు వార్తల్లో నిలుస్తోంది. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, రహస్యంగా ఎంగేజ్మెంట్ కూడా జరిగిపోయిందని వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా అయితే వీరి పెళ్లి తేదీ కూడా ఫిక్స్ అయిందన్న వార్తలు టాలీవుడ్‌లో వైరల్ అవుతున్నాయి. ఈ సెలబ్రెటీ కపుల్ పెళ్లి వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే?
సోషల్ మీడియాలో వైరలవుతున్న సమాచారం ప్రకారం.. విజయ్-రష్మిక పెళ్లి 2026 ఫిబ్రవరి 26న జరగనుందట. అంతేకాదు, ఈ జంట వివాహ వేడుక రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో (Udaipur Palace) రాయల్ గా, అంగరంగ వైభవంగా జరపాలని ఇరు కుటుంబాలు నిర్ణయించుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ వార్త వైరల్ కావడంతో అభిమానులు సోషల్ మీడియాలో కంగ్రాట్స్ మెసేజ్‌లతో ముంచెత్తుతున్నారు.

ఇటీవల అక్టోబర్ నెలలో రహస్యంగా వీరిద్దరికి ఎంగేజ్మెంట్ జరిగిందనే వార్తలు బయటకు రావడంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. అక్టోబర్ 3న శుక్రవారం కేవలం ఇరు కుటుంబాల సభ్యుల మధ్య జరిగిన ఆ నిశ్చితార్థం వేడుక జరిగినట్టు టాక్. రష్మిక చేతికి కనిపించిన ఉంగరం ఫ్యాన్స్ దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత జగపతి బాబు టాక్ షోలో రష్మిక "నా రింగ్ చాలా స్పెషల్" అని చెప్పడంతో, ఆమె పరోక్షంగా ఎంగేజ్మెంట్ విషయాన్ని ఒప్పుకున్నట్లు అందరూ భావించారు.
ఇక పెళ్లి ప్లానింగ్ విషయానికి వస్తే.. మొదట హైదరాబాద్‌లో సంప్రదాయ పద్ధతిలో జరపాలనే ఆలోచన ఉన్నప్పటికీ, చివరికి డెస్టినేషన్ వెడ్డింగ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఉదయ్‌పూర్ ప్యాలెస్ లో వీరి వివాహా వేడుకను ఘనంగా నిర్వహించేందుకు రెండు కుటుంబాలు ఏర్పాట్లు ప్రారంభించాయట. ఇది భారత సినీ ప్రపంచంలోనే అత్యంత గ్లామరస్ వెడ్డింగ్‌గా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
ఇదెలా ఉంటే.. విజయ్ ప్రస్తుతం తన కొత్త సినిమా షూటింగులతో బిజీగా ఉన్నప్పటికీ, పెళ్లి ఏర్పాట్ల విషయంలో చాలా ఇన్‌వాల్వ్ అవుతున్నాడట. అదే విధంగా రష్మిక కూడా తన ప్రాజెక్ట్స్ అయిన ది గర్ల్ ఫ్రెండ్ ప్రమోషన్స్, మరో బాలీవుడ్ సినిమా షూటింగ్స్ లో ఉన్నారు. ఇద్దరూ తమ పెళ్లిని "మర్చిపోలేని అనుభవంగా" మార్చుకోవాలని నిర్ణయించుకున్నారని సన్నిహితులు చెబుతున్నారు.
వీరి పెళ్లి అతిథి జాబితా కూడా టాలీవుడ్ హాట్ టాపిక్‌గా మారింది. రామ్ చరణ్, మహేష్ బాబు, సమంత, రష్మికకు దగ్గరైన బాలీవుడ్ స్నేహితులు రణబీర్ కపూర్, కియారా అద్వాని వంటి ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యే అవకాశం ఉందట. పెళ్లి వేడుకను లగ్జరీగా జరపాలని ప్లాన్ చేస్తున్నారు.
వీరిద్దరి బంధం గీత గోవిందం, డియర్ కామ్రెడ్ సినిమా షూటింగ్ లో ప్రారంభమైనట్టు టాక్. ఈ షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమబంధంగా మారిందనీ పలు రూమర్స్ వచ్చాయి. ఈ వార్తలకు ఊతమిచ్చేలా.. ప్రతి సారి వీరు ఒకే ప్రదేశంలో కనిపించడం, పలు మార్లు మీడియా కంటబడటంతో డేటింగ్ రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కానీ ఎప్పుడూ విజయ్ గానీ, రష్మిక గానీ ఆ వార్తలను ఖండించకపోవడంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ఇప్పుడు ఆ ప్రేమకథకు "హ్యాపీ ఎండింగ్" దిశగా ఈ పెళ్లి వార్తలు దారితీస్తున్నాయి.
ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినా, ఈ వార్తలు నిజమేనన్న నమ్మకం అభిమానుల్లో గట్టిగా ఉంది. టాలీవుడ్ లోనే కాకుండా మొత్తం దక్షిణాది సినీ ప్రేమికులు ఈ పెళ్లి కోసం ఎదురుచూస్తున్నారు. ఇరు కుటుంబాల నుంచి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని టాక్. ఏదేమైనా, రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న వివాహం జరిగితే, అది టాలీవుడ్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా అతి పెద్ద సినీ వేడుకగా నిలవడం ఖాయం.


Click it and Unblock the Notifications











