Vijay-Rashmika: రష్మిక పెళ్లికి ఆ ఓటీటీ భారీ ఆఫర్.. విజయ్ దేవరకొండ షాకింగ్ నిర్ణయం..

Vijay-Rashmika: టాలీవుడ్‌లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న పెళ్లి వార్త. గత కొన్ని రోజులుగా ఈ మోస్ట్ క్రేజీ కపుల్ వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు వీరిద్దరి నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినా, ఈ నెల 26న రాజస్థాన్‌లోని ఉదయ్ పూర్ లో వివాహం జరగనుందన్న కథనాలు అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మరో సంచలన విషయం నెట్టింట వైరల్ అవుతోంది.

విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న వివాహ వేడుక ఓటీటీ స్ట్రీమింగ్ కాబోతున్నటు వార్తలు వస్తున్నాయి. అయితే.. వీరి పెళ్లి వీడియో స్ట్రీమింగ్ హక్కుల కోసం ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ ( Netflix)ఏకంగా రూ.60 కోట్ల భారీ ఆఫర్ ఇచ్చిందన్న టాక్ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సెలబ్రిటీ వెడ్డింగ్‌లను డాక్యుమెంటరీలుగా లేదా స్పెషల్ స్ట్రీమింగ్ ఈవెంట్లుగా మార్చే ట్రెండ్ ఇటీవల ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో బాగా పెరిగింది. అదే కోవలో విజయ్-రష్మిక వివాహాన్ని కూడా గ్లోబల్ ఆడియెన్స్‌కు తీసుకెళ్లాలని నెట్‌ఫ్లిక్స్ ప్రయత్నించిందని సమాచారం.

Vijay Deverakonda-Rashmika Mandanna Wedding Rumours OTT Offers 60 Crore Vijay Says No to Streaming Deal

మరోవైపు.. విజయ్ దేవరకొండ మాత్రం ఈ డీల్‌ను సున్నితంగా తిరస్కరించినట్లు టాక్. "పెళ్లి అనేది పూర్తిగా వ్యక్తిగత విషయం. దాన్ని పబ్లిక్ ఈవెంట్‌గా మార్చుకోవాలనే ఉద్దేశం లేదు" అన్నదే ఆయన నిర్ణయానికి కారణమని తెలుస్తోంది. అంతేకాదు, ఓటీటీ ఒప్పందాల వల్ల వచ్చే లీగల్ షరతులు, షూటింగ్ పరిమితులు, అతిథులకు కలిగే ఇబ్బందులు వంటి అంశాలను కూడా ఈ జంట పరిగణనలోకి తీసుకున్నారని సమాచారం.

గతంలో పలువురు సెలబ్రిటీల వివాహాలు ఓటీటీ డాక్యుమెంటరీలుగా వచ్చినప్పటికీ, వాటి చుట్టూ చట్టపరమైన చిక్కులు తలెత్తిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకుని విజయ్- రష్మిక ఈ ఆఫర్‌కు నో చెప్పారని సినీ వర్గాలు చెబుతున్నాయి.

మరోవైపు విజయ్ దేవరకొండ ప్రస్తుతం తన కెరీర్‌పై ఫుల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. రణబలి, రౌడీ జనార్ధన్ వంటి ప్రాజెక్ట్‌లతో మళ్లీ బలమైన కంబ్యాక్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇక రష్మిక మందన్న కూడా బాలీవుడ్, సౌత్ సినిమాలతో బిజీగా ఉన్నారు. అయినప్పటికీ పెళ్లి దగ్గర పడినా షూటింగ్స్ ఆపలేదన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

ఉదయ్‌పూర్‌లో ఇప్పటికే కొన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయంటూ వైరల్ వీడియోలు చక్కర్లు కొడుతున్నా... ఇవన్నీ నిజమా? లేక కేవలం రూమర్స్‌ మాత్రమేనా? అన్నది ఇంకా స్పష్టతకు రాలేదు. ఫిబ్రవరి 26 వస్తే కానీ అసలు నిజం బయటపడే అవకాశం లేదని అభిమానులు భావిస్తున్నారు. ఓటీటీ (OTT) రూ.60 కోట్ల ఆఫర్, విజయ్ తీసుకున్న ప్రైవసీ నిర్ణయం, ఉదయ్‌పూర్ పెళ్లి ప్రచారం ఈ అన్ని అంశాలు కలిసి విజయ్ దేవరకొండ-రష్మిక మందన్న పెళ్లి వార్తలను దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మార్చేశాయి. రానున్న రోజుల్లో వీరిద్దరూ స్వయంగా క్లారిటీ ఇస్తారా? లేక రూమర్స్‌కే చెక్ పడుతుందా? అన్నది చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X