VijRash Wedding Card: క్రేజీగా విజయ్ దేవరకొండ వెడ్డింగ్ కార్డ్.. రష్మిక మందన్న పెళ్లి పిలుపు వైరల్!

Vijay Deverakonda- Rashmika: టాలీవుడ్‌లో గత కొంతకాలంగా హాట్ టాపిక్‌గా మారిన విషయం ఏదైనా ఉందంటే అది విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న పెళ్లి వార్తలే. తాజాగా వీరిద్దరి పేర్లతో కూడిన వెడ్డింగ్ కార్డ్ నెట్టింట వైరల్ అవుతుంది. దీంతో పెళ్లి ప్రచారం మరింత ఊపందుకుంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు. ఇప్పటివరకు "మేము మంచి స్నేహితులమే" అని చెప్పుకొచ్చిన ఈ జంట నిజంగానే పెళ్లి బంధంలోకి అడుగుపెట్టబోతుందా? లేక ఇది మరో గాసిప్ మాత్రమేనా? అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.

గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల సమయంలో మొదలైన స్నేహం ప్రేమగా మారిందనే గాసిప్స్ చాలాకాలంగా వినిపిస్తున్నాయి. ఇద్దరూ పబ్లిక్‌గా "మేము మంచి స్నేహితులమే" అని చెబుతున్నా, సోషల్ మీడియాలో ఒకే లొకేషన్ ఫోటోలు, విదేశీ ట్రిప్స్, ఈవెంట్ హాజరులు ఈ వార్తలకు బలం చేకూర్చాయి. గతేడాది అక్టోబర్‌లో నిశ్చితార్థం జరిగిందనే వార్తలపైనా వీరు స్పందించకపోవడం గమనార్హం.

Vijay Deverakonda Rashmika Wedding Card Sparks Feb 26 Marriage Buzz

సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో రాయల్ ప్యాలెస్‌లో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య సింపుల్‌గా పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. పెళ్లి వేడుకను గోప్యంగా ఉంచాలన్న ప్రయత్నం చేస్తున్నప్పటికీ సమాచారం లీక్ అవుతూనే ఉందని అంటున్నారు. పెళ్లి ఉదయ్‌పూర్‌లో జరిగినా, అసలు హంగామా మాత్రం హైదరాబాద్ రిసెప్షన్‌లోనే ఉండబోతుందన్న టాక్ వినిపిస్తోంది. టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు హాజరవుతారనే అంచనాలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో తాజాగా సోషల్ మీడియాలో వీరిద్దరి పేర్లతో కూడిన ఓ వెడ్డింగ్ కార్డ్ వైరల్ అవుతుంది. దీంతో పెళ్లి ప్రచారం మరింత ఊపందుకుంది. ఆ కార్డు ప్రకారం ఫిబ్రవరి 26న వివాహం, మార్చి 4న హైదరాబాద్ బంజారాహిల్స్‌లో రిసెప్షన్ నిర్వహించనున్నట్లు పేర్కొనడం చర్చకు దారి తీసింది. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు.

ఇటీవల విజయ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం కూడా ఈ ప్రచారానికి మరింత ఊతమిచ్చింది. ఆహ్వాన పత్రిక ఇవ్వడానికే ఆ భేటీ జరిగిందా? అనే చర్చలు సోషల్ మీడియాలో జోరుగా సాగుతున్నాయి. అయితే ఈ భేటీ వెనుక అసలు కారణంపై అధికారిక స్పష్టత లేదు. అధికారిక ప్రకటన వెలువడే వరకు ఇవన్నీ ఊహాగానాలుగానే పరిగణించాల్సి ఉంటుంది. నిజంగానే ఫిబ్రవరి 26న వివాహమా? లేక ఇది మరో సోషల్ మీడియా హడావుడేనా? అన్నది తేలాలంటే కొద్దిరోజులు వేచి చూడాల్సిందే.

ఇంకా ఒక ఆసక్తికర అంశం ఏమిటంటే, విజయ్- రష్మిక జంట మరోసారి తెరపై కనిపించబోతోందని వార్తలు. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ తెరకెక్కిస్తున్న రణబాలి(Ranabaali) సినిమాలో ఈ జంట నటిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా నేపథ్యంలోనే పెళ్లి రూమర్స్ మరింతగా వైరల్ అవుతున్నాయా? అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X