విజయ్-రష్మిక పెళ్లి ఫోటోలు బయటికి రాకుండా మాస్టర్ ప్లాన్.. అతిథులకు స్ట్రిక్ట్ ఆర్డర్స్..
Vijay-Rashmika wedding: టాలీవుడ్‌లో ఎన్నాళ్లుగానో వినిపిస్తున్న పెళ్లి ఊహాగానాలు ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి. సూపర్ క్రేజ్ ఉన్న హీరో విజయ్ దేవరకొండ- హీరోయిన్ రష్మిక మందన్నా వివాహం ఫిబ్రవరి 26న జరగబోతోందన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు ఈ జంట అధికారిక ప్రకటన చేయలేదు. అయినా ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం రాజస్థాన్‌లోని ఉదయ్ పూర్ లో పెళ్లి ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నట్టు తెలుస్తోంది.
ఇప్పటికే కొందరు సన్నిహితులకు వెడ్డింగ్ ఇన్విటేషన్లు పంపించారని, 24, 25 తేదీల్లో సంగీత్, హల్దీ వంటి ప్రీ-వెడ్డింగ్ వేడుకలు జరగనున్నాయని టాక్. 26న సంప్రదాయబద్ధంగా వివాహం నిర్వహించాలనే ప్లాన్‌లో ఉన్నారని సమాచారం. అయితే ఈ పెళ్లిని పూర్తిగా ప్రైవేట్ ఈవెంట్‌గా మార్చాలని విజయ్-రష్మిక నిర్ణయించుకున్నట్టు వారి సన్నిహితులు చెబుతున్నారు.

ఫొటోలు బయటికి రాకుండా మాస్టర్ ప్లాన్
ఈ వెడ్డింగ్‌కు సంబంధించి ఇప్పుడు ఎక్కువగా చర్చనీయాంశమవుతున్నది. నో ఫోన్ పాలసీ. పెళ్లికి వచ్చే అతిథులు ఎవ్వరూ మొబైల్ ఫోన్లు తీసుకురాకూడదని స్పష్టమైన కండిషన్ పెట్టారట. దీనికి కారణం ఒక్కటే. పెళ్లి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో లీక్ కాకుండా చూడడమే. తమ వ్యక్తిగత క్షణాలు వైరల్ కావద్దన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.
అంతేకాదు, అతిథులు ఎలాంటి గిఫ్టులు కూడా తీసుకురావొద్దని ప్రత్యేకంగా కోరారట. 'మీ రాకే మాకు పెద్ద గిఫ్ట్' అంటూ చేతిరాతతో ఉన్న లేఖలను స్నేహితులు, బంధువులకు పంపించినట్టు సమాచారం. ఇది ఈ జంట ఎంత సింపుల్‌గా ఈ వేడుకను జరుపుకోవాలనుకుంటోందో చెప్పే ఉదాహరణగా అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
నో సెలబ్రిటీస్... కుటుంబ సభ్యుల మధ్యే పెళ్లి
ఇతర స్టార్ వెడ్డింగ్స్‌కు భిన్నంగా, ఈ పెళ్లికి సినీ ప్రముఖులను ఆహ్వానించడం లేదట. 'నో సెలబ్రిటీస్ పాలసీ'ని ఫాలో అవుతూ కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలోనే వివాహం జరగనుందని టాక్. అయితే పెళ్లి తర్వాత మార్చి 4న హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేసి, అప్పుడే ఇండస్ట్రీ సెలబ్రిటీలను ఆహ్వానించనున్నారని సమాచారం.
పెళ్లి తర్వాత బ్రేక్... హనీమూన్ ప్లాన్?
వివాహం పూర్తయిన వెంటనే విజయ్, రష్మిక ఇద్దరూ నెల రోజుల పాటు షూటింగ్‌లకు విరామం ఇవ్వబోతున్నారట. ఆ తర్వాత విదేశాలకు వెళ్లి హనీమూన్ ఎంజాయ్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఇద్దరూ తమ సినిమా కమిట్‌మెంట్స్‌ను కొద్దికాలం పక్కన పెట్టి పెళ్లి ఏర్పాట్లలో బిజీగా ఉన్నారని సమాచారం.
ఎటువంటి ఆడంబరాలు లేకుండా, మీడియా హడావుడి దూరంగా, పూర్తిగా వ్యక్తిగత వేడుకగా తమ పెళ్లిని జరుపుకోవాలన్నదే విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న ఆలోచనగా కనిపిస్తోంది. నో ఫోన్ పాలసీ, నో గిఫ్ట్స్, నో సెలబ్రిటీస్ వంటి స్ట్రిక్ట్ రూల్స్ ఈ నిర్ణయాన్ని మరింత స్పష్టం చేస్తున్నాయి. అయితే అధికారిక ప్రకటన లేకపోయినా, ఇండస్ట్రీలో వినిపిస్తున్న ఈ వార్తలు అభిమానుల్లో భారీ ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. నిజంగానే ఫిబ్రవరి 26న ఈ స్టార్ జంట పెళ్లి పీటలు ఎక్కుతుందా? లేక ఇవన్నీ ఊహాగానాలేనా? అన్నది త్వరలోనే తేలనుంది.


Click it and Unblock the Notifications











