60 కోట్ల ఆఫర్ విజయ్ దేవరకొండ రిజెక్ట్?.. రష్మిక మందన్నతో పెళ్లికి బిగ్ డీల్!
Rashmika Mandanna- Vijay Deverakonda: టాలీవుడ్‌లో మరో క్రేజీ సెలబ్రిటీ వెడ్డింగ్ వార్త హాట్ టాపిక్‌గా మారింది. స్టార్ హీరో విజయ్ దేవరకొండ- నేషనల్ క్రష్ రష్మిక మందన్నా త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇప్పటివరకు వీరిద్దరి నుంచి అధికారిక ప్రకటన రాకపోయినా పెళ్లి రూమార్స్ మాత్రం తెగ వైరలవుతున్నాయి.ఈ క్రమంలో ఈ సెలబ్రెటీ జంట ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్ పూర్ లో వివాహం జరుగుతుందన్న కథనాలు అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఆ తర్వాత మార్చి 6న హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ ఉంటుందన్న టాక్ కూడా వినిపిస్తోంది.ఈ నేపథ్యంలో తాజాగా మరో సంచలన విషయం నెట్టింట వైరల్ అవుతోంది. ఏమిటంటే?
ఇటీవల సెలబ్రిటీ వెడ్డింగ్స్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు పెద్ద బిజినెస్‌గా మారాయి. ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థలు పెళ్లి వీడియో హక్కులను కొనుగోలు చేసి ప్రత్యేక డాక్యుమెంటరీలుగా విడుదల చేస్తున్నాయి. ఇందుకోసం కోట్లు ఖర్చు చేయడానికీ వెనుకాడటం లేదు. ఇదే ట్రెండ్‌లో భాగంగా రష్మిక మందన్న - విజయ్ దేవరకొండ పెళ్లి వీడియో హక్కుల కోసం కూడా ఓ ఓటీటీ దిగ్గజం నెట్ ఫిక్స్ (Netflix)ఏకంగా రూ.60 కోట్ల భారీ ఆఫర్ ఇచ్చిందట. అదే కోవలో ఈ పెళ్లిని కూడా గ్లోబల్ ఆడియెన్స్‌కు తీసుకెళ్లాలని నెట్‌ఫ్లిక్స్ ప్రయత్నించిందని ఇండస్ట్రీ టాక్.

అయితే ఈ భారీ డీల్‌ను విజయ్-రష్మిక జంట మర్యాదపూర్వకంగా తిరస్కరించిందని ప్రచారం. ముఖ్యంగా హీరో విజయ్ దేవరకొండ 'పెళ్లి అనేది పూర్తిగా వ్యక్తిగత విషయం. దాన్ని పబ్లిక్ ఈవెంట్‌లా మార్చుకోవాలనే ఉద్దేశం లేదు'అన్నదే వారి నిర్ణయానికి కారణమని తెలుస్తోంది. డబ్బుకంటే ప్రైవసీకి ఎక్కువ విలువ ఇస్తున్నట్టు తెలుస్తోంది.
గతంలో సెలబ్రిటీ వెడ్డింగ్ డాక్యుమెంటరీల చుట్టూ చట్టపరమైన చిక్కులు తలెత్తిన సందర్భాలూ ఉన్నాయి. ముఖ్యంగా నయనతార- విఘ్నేష్ శివన్పెళ్లి డాక్యుమెంటరీ విషయంలో, నిర్మాత ధనుష్ కాపీ రైట్ కేసు వేయడం అప్పట్లో పెద్ద చర్చకు దారి తీసింది. అలాంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకుని కూడా విజయ్-రష్మిక ఈ ఆఫర్‌కు నో చెప్పి ఉండవచ్చని సినీ వర్గాలు అంటున్నాయి. ఓటీటీ ఒప్పందాలతో వచ్చే లీగల్ షరతులు, షూటింగ్ పరిమితులు, అతిథులకు కలిగే ఇబ్బందులు వంటి అంశాలను కూడా ఈ జంట పరిగణనలోకి తీసుకుని ఈ డీల్ ను రిజెక్ట్ చేసినట్టు తెలుస్తోంది.
అలాగే.. వీరి పెళ్లి వేడుక ఉదయ్‌పూర్‌లో జరగబోతున్నట్టు టాక్. ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నాయంటూ వైరల్ వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. అదే సమయంలో ఈ సెలబ్రెటీ జంట తమ ప్రత్యేక రోజును కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్యే జరుపుకోవాలని, అలాగే చాలా సింపుల్ గా, సాదాసీదాగా జరుపుకోవాలని భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే.. ఇవన్నీ నిజమా? లేక కేవలం రూమర్స్ మాత్రమేనా? అన్నది ఇంకా స్పష్టతకు రాలేదు. ఫిబ్రవరి 26 వస్తే కానీ అసలు నిజం బయటపడే అవకాశం లేదని అభిమానులు భావిస్తున్నారు.
మరోవైపు విజయ్ దేవరకొండ ప్రస్తుతం కెరీర్‌పై ఫుల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. రణబలి, రౌడీ జనార్ధన్ వంటి ప్రాజెక్ట్‌లతో మళ్లీ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇక రష్మిక మందన్న కూడా సౌత్‌తో పాటు బాలీవుడ్ చిత్రాలతో బిజీగా కొనసాగుతోంది. పెళ్లి దగ్గర పడినా షూటింగ్స్ ఆపలేదన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇలా పలు అంశాలు కలిసి విజయ్ దేవరకొండ-రష్మిక మందన్న పెళ్లి రూమార్స్ మాత్రం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మార్చేశాయి. రానున్న రోజుల్లో వీరిద్దరూ స్వయంగా క్లారిటీ ఇస్తారా? లేక రూమర్స్‌కే చెక్ పడుతుందా? అన్నది చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











