For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ముంబై అపార్ట్‌మెంటా? ఎన్ని కోట్లిచ్చినా కుదరదు.. విజయ్ దేవరకొండ

|
Vijay Devarakonda Rejects Karan Johar's Huge Offer || Filmibeat Telugu

సౌత్ ఇండియాలో అనతి కాలంలోనే అశేష అభిమాన వర్గాన్ని కూడగట్టుకున్నాడు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ. క్లాస్, మాస్ ఆడియన్స్ అందరినీ ఫాన్స్‌గా మలచుకొని భారీ ఫాలోయింగ్ ఉన్న హీరోగా సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ''అర్జున్ రెడ్డి, గీత గోవిందం, టాక్సీవాలా'' లాంటి వరుస హిట్స్ ఆయనను ఓ రేంజ్ లోకి తీసుకెళ్లాయి. ఇక విజయ్ దేవరకొండ ప్రెసెంట్ మూవీ 'డియర్ కామ్రేడ్' భారీ అంచనాల నడుమ రిలీజై మిశ్రమ స్పందన తెచ్చుకుంది. అయినప్పటికీ విజయ్ క్రేజ్ పై ఏమాత్రం ఎఫెక్ట్ పడలేదు. పైగా ఆయనకు భారీ ఆఫర్ కూడా లభించిందట. వివరాల్లోకి పోతే..

'డియర్ కామ్రేడ్' హిందీ రీమేక్

'డియర్ కామ్రేడ్' హిందీ రీమేక్

'డియర్ కామ్రేడ్' సినిమా హిందీ రీమేక్ పనులు చకచకా జరుగుతున్నాయట. ఇటీవలే ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తానని బాలీవుడ్ బడా దర్శకనిర్మాత కరణ్ జోహార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇందుకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలెట్టేశారని తెలుస్తోంది. అయితే తెలుగులో నటించిన విజయ్ దేవరకొండనే హిందీలో కూడా నటింపజేయాలని, అందుకు గాను విజయ్ దేవరకొండకు కరణ్ జోహార్ 40 కోట్లు ఆఫర్ చేశాడని వార్తలు వచ్చాయి.

కుదరదన్న విజయ్ దేవరకొండ

కుదరదన్న విజయ్ దేవరకొండ

బడా డైరెక్టర్ కరణ్‌ జోహార్.. డియర్ కామ్రేడ్ రీమేక్ ద్వారా విజయ్ దేవరకొండను బాలీవుడ్‌కు పరిచయం చేయాలని అనుకున్నారట. అందుకోసమే ఆయనకు 40 కోట్ల భారీ ఆఫర్‌ ప్రకటించాడట. కానీ విజయ్ మాత్రం దీన్ని సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. గతంలో కూడా ‘అర్జున్‌ రెడ్డి' హిందీ రీమేక్‌ కోసం కూడా విజయ్‌ని సంప్రదిస్తే నో చెప్పేసిన సంగతి తెలిసిందే.

మరోసారి ఆ పాత్రలోనే అంటే కుదరదు.. పైగా ముంబై అపార్ట్‌మెంటా?

మరోసారి ఆ పాత్రలోనే అంటే కుదరదు.. పైగా ముంబై అపార్ట్‌మెంటా?

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ దేవరకొండ తన బాలీవుడ్ ఎంట్రీపై స్పందించాడు. తనకు హిందీ సినిమాల్లో నటించాలని ఉందని, కాకపోతే ఒకసారి నటించిన పాత్రలోనే మరోసారి నటించనని అన్నాడు. తన సినిమా తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి విడుదలైతే ఓకే గానీ ఇలా రీమేక్ అంటే ఇష్టముండదని తెలిపాడు. ఫ్రెండ్స్, ఫ్యామిలీ అంతా హైదరాబాద్‌లో ఉండగా, తానొక్కడినే ముంబై అపార్ట్‌మెంట్‌కి మారడం ఇష్టం లేదన్నారు విజయ్ దేవరకొండ.

అందుకే డిమాండ్ నెలకొందా?

అందుకే డిమాండ్ నెలకొందా?

మరోవైపు ఇప్పటికే విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి రీమేక్ 'కబీర్ సింగ్' సూపర్ సక్సెస్ కావడంతో 'డియర్ కామ్రేడ్' రీమేక్‌పై బీ టౌన్ ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన పూర్తి వివారాలు తెలియనున్నాయి. ఈ సినిమాలో ఇషాన్ కట్టర్, జాన్వీ జోడీ నటించనుందని మరో ప్రచారమూ నడుస్తోంది.

 డియర్ కామ్రేడ్ మూవీ

డియర్ కామ్రేడ్ మూవీ

భరత్ కమ్మ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా రూపొందిన 'డియర్ కామ్రేడ్' చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫస్ట్ వీక్ కంప్లీట్ చేసుకుంది. భారీ అంచనాలతో గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా మిక్డ్స్ టాక్ తో వారం పూర్తి చేసుకుంది. ఓవరాల్‌గా చూస్తే డియర్ కామ్రేడ్ కలెక్షన్స్ వీక్ గానే ఉన్నాయి.

English summary
Tollywood star hero Vijay Deverakonda has managed command a huge fan following among youth with just a few films. Success of Arjun Reddy and Geetha Govindam, he is regarded as an icon among youngsters in South India level. His latest movie Dear Comrade will planing to remake in hindi.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more