రానా హోస్ట్‌తో విజయ్ దేవరకొండ ఎఫైర్.. ఆ ఫారెన్ సుందరి అసలు కథ ఇదే!

Recommended Video

Vijay Deverakonda Gets Rumors With A Belgium Girl

విజయ్ దేవర కొండ టాలీవుడ్ లో క్రేజీ హీరోగా మారిపోయాడు. సినిమా సినిమాకి విజయ్ దేవరకొండ క్రేజ్ పెరుగుతోంది. ఇటీవల గీత గోవిందం చిత్రంతో మరో మారు మాయ చేసిన విజయ్ కొండ త్వరలో నోటా చిత్రంతో రాబోతున్నాడు. గీత గోవిందం చిత్రం స్టార్ హీరోల సినిమాల రేంజ్ లో వసూళ్లు కొల్లగొట్టింది. విజయ్ దేవకొండ గురించి కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఫారెన్ సుందరితో విజయ్ దేవరకొండ ప్రేమాయణం సాగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దానికి సంబందించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అసలు కథ ఏంటి

అసలు కథ ఏంటి

అర్జున్ రెడ్డి, గీత గోవిందం చిత్రాలతో విజయ్ దేవరకొండ టాలీవడ్ లో యూత్ ఐకాన్ గా మారిపోయాడు. అతడి గురించి చిన్న విషయమైనా మీడియాలో పెద్దదిగా అవుతోంది. సినీ తారల వ్యక్తిగత జీవితాల గురించి వార్తలు వైరల్ కావడం సహజమే. విజయ్ దేవరకొండ, ఓ ఫారెన్ సుందరి అంటూ పలురకాల కథనాలు వెలువడుతున్నాయి.

ఎవరా విదేశీ సుందరి

ఎవరా విదేశీ సుందరి

విజయ్ దేవరకొండ, వర్జీని అనే ఫారెన్ యువత మధ్య ఘాటు ప్రేమ వ్యవహారం సాగుతోంది అంటూ వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలకు బలాన్ని చేకూరుస్తూ సోషల్ కొన్ని ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. ఆ ఆ యువతి బెల్జియంకు చెందిన అమ్మాయి అట. విజయ్ దేవరకొండ పెళ్లి చూపులు చిత్రంలో కూడా వర్జీని మెరిసింది.

రానా షోలో కూడా

రానా షోలో కూడా

పెళ్లి చూపులు చిత్ర సమయంలో ఆరడుగుల ఆజానుబాహుడు దగ్గబాటి రానా నెం 1 యారీ అనే షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఆ షోలో కూడా వర్జీని మెరిసినట్లు తెలుస్తోంది. పెళ్లి చూపులు చిత్రం తరువాత ఏడాది పాటు ఆ యువత తన కుటుంబ సభ్యులతో హైదరాబాద్ లోనే ఉన్నట్లు తెలుస్తోంది.

కుటుంబ సభ్యులతో సన్నిహితంగా

కుటుంబ సభ్యులతో సన్నిహితంగా

విజయ్ దేవరకొండతోనే కాదు.. అతడి కుటుంబ సభ్యులతో కూడా వర్జీని సన్నిహితంగా ఉండే ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలలో విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో పాటు వర్జీని కుటుంబ సభ్యులు కూడా ఉండడం విశేషం.

స్నేహితురాలా లేక

స్నేహితురాలా లేక

వర్జీని, విజయ్ దేవరకొండ మధ్య సాగుతున్నది కేవలం స్నేహమేనా లేక ప్రేమ వరకు వెళ్ళారా అనేది ఇంకా సస్పెన్సే. వర్జీని గురించి వార్తలు వస్తున్నాయి కానీ విజయ్ దేవర కొండ ఈ వ్యవహారం గురించి స్పందించే వరకు ఆమె మిస్టరీ అమ్మాయే.

రాజకీయ నాయకుడిగా

రాజకీయ నాయకుడిగా

అర్జున్ రెడ్డి, గత గోవిందం చిత్రాలతో విజయ్ దేవరకొండకు యువతలో ఫాలోయింగ్ పెరిగింది. ఈ సారి ప్రయోగాత్మక చిత్రంతో విజయ్ దేవరకొండ మన ముందుకు రాబోతున్నాడు. విజయ్ దేవరకొండ నటించిన నోటా చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంద. ఈ చిత్రంలో విజయ్ పొలిటికల్ లీడర్ అవతారం ఎత్తబోతున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X