విజ‌య్‌ దేవ‌ర‌కొండ లవర్స్ డే కానుక.. ఆ రోజునే!

టాలీవుడ్‌లో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హవా నడుస్తోంది. వరుస సినిమాలతో బిజీగా ఉంటూ పక్కా ప్లాన్ ప్రకారం సాగిపోతున్నాడు ఈ రౌడీ స్టార్. ఇటీవలే డియర్ కామ్రేడ్ సినిమాతో కాస్త డీలా పడినా, కుర్రాడిలో జోష్ మాత్రం తగ్గలేదు. ఈ నేపథ్యంలోనే సొంతంగా నిర్మాణ సంస్థ ప్రారంభించి 'మీకు మాత్రమే చెప్తా' అంటూ చెప్పాల్సిందంతా చెప్పేశాడు. ఇక ఇప్పుడు క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ లో నిమిషం తీరిక లేకుండా పాల్గొంటున్నాడు.

ఈ సినిమాకు 'వరల్డ్ ఫేమస్ లవర్' అనే టైటిల్ కన్ఫర్మ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి ఇటీవలే విడుదలైన లుక్స్ ప్రేక్షకుల నుంచి విశేష స్పందన తెచ్చుకున్నాయి. ప్ర‌స్తుతం సినిమా చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకోవడంతో రిలీజ్ డేట్ విషయమై ఓ క్లారిటీకి వచ్చేశారట దర్శకనిర్మాతలు.

Vijay Deverakondas World Famous Lover Release Date Fixed

ఈ చిత్రాన్ని ప్రేమికుల దినోత్స‌వమైన ఫిబ్ర‌వ‌రి 14న విడుద‌ల చేయాల‌ని ఫిక్స్ అయ్యారట. 'వరల్డ్ ఫేమస్ లవర్' టైటిల్ కి తగ్గట్టుగా లవర్స్ డే అయితేనే ఈ సినిమాకు బాగా కలిసొస్తుందని భావిస్తున్నారట మేకర్స్. ఈ మేరకు అదే రోజు విడుదల చేయాలని డేట్ కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అఫీషియల్ సమాచారం ఇవ్వనున్నారట.

ఇక 'వరల్డ్ ఫేమస్ లవర్' చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన రాశీఖ‌న్నా, ఐశ్వ‌ర్యా రాజేశ్‌, క్యాథ‌రిన్ ట్రెసా, ఇజాబెల్లా హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. ప్రేమ‌క‌థా చిత్రం అందులోనూ యూత్‌లో మంచి క్రేజ్ ఉన్న విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు ప్రేక్షకులు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X