Kushi: లీకైన ఖుషి టీమ్ రెమ్యునరేషన్ లిస్ట్.. విజయ్, సమంతకు ఎంతో తెలిస్తే షాకే!
చిన్న పాత్రలు, నెగెటివ్ రోల్స్ చేస్తూ రౌడీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda). ఎవడే సుబ్రహ్మణ్యం, పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం వంటి చిత్రాలతో మంచి క్రేజ్, ఫ్యాన్స్ ను సంపాదించుకున్నాడు. కానీ, ఇటీవల లైగర్ తో ప్లాప్ చూసిన విజయ్ మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. అందులో భాగంగా చేసిన సినిమానై ఖుషి (Kushi 2023). త్వరలో విడుదల కానున్న ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ, సమంత, డైరెక్టర్ శివ నిర్వాణ తీసుకున్న రెమ్యునరేషన్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
భార్యాభర్తలుగా:రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సౌత్ స్టార్ హీరోయిన్ సమంత మరోసారి కలిసి నటించిన చిత్రం ఖుషి (Kushi). ఇంతకుముందు వీరిద్దరూ మహానటి సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్న విషయం తెలిసిందే. అందులో సమంత వెంటపడే ప్రేమికుడి పాత్రలో విజయ్ దేవరకొండ ఆకట్టుకుంటే ఖుషి సినిమాలో ప్రేమించి, పెళ్లి చేసుకుని గొడవ పడే భార్యాభర్తలుగా అలరించనున్నారు. ఇక ఈ సినిమాకు నిన్ను కోరి, మజిలీ, టక్ జగదీష్ చిత్రాల దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించారు.

మంచి రెస్పాన్స్:మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మిస్తున్న ఖుషి సినిమాకు మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తున్నారు. హృదయం సినిమాతో ఆకట్టుకున్న హేషమ్ అబ్దుల్ వాహబ్ తెలుగులో ఖుషి సినిమాతో ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాపై మొదటి నుంచి అంచనాలు పెరగ్గా.. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, పాటలు మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఇక ఆగస్ట్ 9న రిలీజైన ట్రైలర్ కు భారీ రెస్పాన్స్ వస్తోంది. ఈ ట్రైలర్ తోనే సినిమా కథేంటో చెప్పేశారు మేకర్స్.

ఆశ్చర్యం:అయితే ఖుషి సినిమాలో విజయ్ దేవరకొండ, సమంతతోపాటు డైరెక్టర్ శివ నిర్వాణ పారితోషికం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఖుషి సినిమాకు విజయ్ దేవరకొండ రూ. 23 కోట్లు తీసుకున్నాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అలాగే సమంత రూ. 4.5 కోట్లు, దర్శకుడు శివ నిర్వాణ రూ. 12 కోట్లు తీసుకున్నాడని టాక్. దీంతో నెటిజన్లు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. వాళ్లకు అన్ని కోట్లు ఇస్తున్నారా? అంటూ ట్రోలింగ్ మొదలెట్టేశారు.

అన్ని కోట్లా:విజయ్ దేవరకొండకు రూ. 10 నుంచి 15 కోట్ల వరకు, సమంతకు మహా అయితే రూ. 2 నుంచి రెండున్నర కోట్లు ఇస్తారేమో గానీ అంత ఇవ్వరంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక శివ నిర్వాణకు రూ. 12 కోట్లు అంటే ఏమాత్రం నమ్మేలా లేదని నవ్వుకుంటున్నారు. వీళ్లకే ఇంత ఇస్తే.. సినిమాకు ఎంత అవుతుంది, దాన్ని రికవరీ చేయాలంటే ఎంత కలెక్ట్ చేయాలి అని చర్చించుకుంటున్నారు. కాగా లైగర్ తో విజయ్, శాకుంతలంతో సామ్, టక్ జగదీష్ తో శివ నిర్వాణ ముగ్గురు ప్లాప్స్ చూశారు. ఇప్పుడు ముగ్గురు ఒకే సినిమాతో హిట్ కొట్టేందుకు ట్రై చేస్తున్నారు.
500కుపైగా లొకేషన్స్:కాగా ఖుషి సినిమా సెప్టెంబర్ 1న థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే ఆగస్ట్ 31నే ఈ సినిమా యూఎస్ లో ప్రీమియర్స్ పడనున్నాయి. యూఎస్ లో దాదాపుగా 500కుపైగా లొకేషన్లలో ఖుషిని రిలీజ్ చేస్తున్నారు. మరి విజయ్ దేవరకొండ ఖుషి సినిమా అక్కడ ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











