విజయ్ దేవరకొండ - సందీప్ రెడ్డి వంగ రీయూనియన్.. మొదలైన కొత్త చర్చ?
స్టార్ హీరో విజయ్ దేవరకొండ నెక్ట్స్ కింగ్డమ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రం మరో 6 రోజుల్లో వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార కార్యక్రమాలు కూడా మొదలయ్యాయి. అయితే టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తాజాగా విజయ్ దేవరకొండతో రీయూనియన్ కావడం ఆసక్తికరంగా మారింది. తాజాగా విజయ్ దేవరకొండ సందీప్ రెడ్డి వంగ నెక్ట్స్ చిత్రమంటూ సినీ వర్గాల్లో ప్రచారం కూడా మొదలైంది. ఆ వివరాల్లోకి వెళితే..
కింగ్డమ్ బడ్జెట్ ఎంత?
విజయ్ దేవరకొండ - గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న స్పై యాక్షన్ ఫిల్మ్ కింగ్డమ్. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే, సత్యదేవ్ వంటి స్టార్ కాస్ట్ పని చేశారు. మరోవైపు టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్ర సంగీత దర్శకత్వం వహించడం విశేషం. మిగితా క్రాఫ్ట్స్ ల్లో టాప్ టెక్నీషియన్లు వర్క్ చేశారు. దీంతో సినిమాకు భారీగానే ఖర్చైంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ ఫర్ సినిమా వంటి బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. నాగ వంశీ నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రానికి రెమ్యునరేషన్లు, నిర్మాణ ఖర్చులు, ప్రచార కార్యక్రమాలకు కలుపుకొని 150 కోట్ల వరకు ఖర్చైందని మేకర్స్ వెల్లడించడం విశేషం.

సందీప్ రెడ్డి వంగ ఎంట్రీ?
6 రోజుల్లో కింగ్డమ్ చిత్రం ఇండియాతో పాటు ఓవర్సీస్ లోనూ గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఇప్పటికే ప్రమోషన్స్ జోరు జరగాల్సి ఉండాల్సి ఉంది. కానీ విజయ్ దేవరకొండ డెంగీ ఫీవర్ కు గురవడంతో కాస్తా డిలే అయ్యింది. ఇక తాజాజా ప్రమోషన్స్ కు విజయ్ దేవరకొండ రెడీ అయ్యారు. ఇదే సమయంలో డాషింగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కూడా కింగ్డమ్ ప్రమోషన్స్ లో భాగమవడం ఆసక్తికరంగా మారింది. విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరితో పాటు సందీప్ రెడ్డి వంగ కూడా జాయిన్ కావడంతో సినిమాపై భారీ హైప్ నెలకొంది. రీసెంట్ గానే మై బాయ్స్ అనే పాడ్ కాస్ట్ ను కూడా రిలీజ్ చేయబోతుండటం ఇంట్రెస్టింగ్ గా మారింది.
సందీప్ రెడ్డి వంగ విజయ్ రియూనియన్?
2017లో సందీప్ రెడ్డి వంగ, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో రొమాంటిక్ ఫిల్మ్ అర్జున్ రెడ్డి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అటు సందీప్ రెడ్డి వంగ, ఇటు విజయ్ దేవరకొండ ఇద్దరి కెరీయర్లు ఊపందుకున్నాయి. ఆ చిత్రం తర్వాత మళ్లీ వీళ్లు ఎప్పుడూ సినిమా చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఓ సందర్భంలో సందీప్ రెడ్డి వంగ మరోసారి విజయ్ తో సినిమా ఉంటుందని కచ్చితంగా చెప్పడం ఇప్పుడు చర్చలోకి వచ్చింది.
కింగ్డమ్ చిత్రం కోసం సందీప్ రెడ్డి వంగ ప్రత్యేకంగా సమయం కేటాయించడంతో దగ్గరల్లో విజయ్ - వంగ కాంబినేషన్ రిపీట్ అవునుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనిపై ఎలాంటి అఫీషియల్ అప్డేట్ మాత్రం అందలేదు. ఇక సందీప్ రెడ్డి వంగ యానిమల్ చిత్రం తర్వాత నెక్ట్స్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో స్పిరిట్ తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం అక్టోబర్ లో సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











