twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బట్టల్లేకుండా...? బిగ్‌బాస్ ఇంటి సభ్యులకు ఆ హీరో షాకివ్వబోతున్నాడా?

    By Bojja Kumar
    |

    Recommended Video

    Bigg Boss Season 2 Telugu : Vijay Devarakonda Enters Into House Shirtless

    బిగ్‌బాస్ ఇంట్లోకి సినిమా ప్రమోషన్ల సమయంలో సెలబ్రిటీలు వస్తుంటారు, పోతుంటారు... ఇందులో షాకవ్వాల్సింది ఏముంది? అనుకుంటున్నారా? మామూలుగా వెళితే ఎవరూ షాకవ్వరు, కానీ బట్టల్లేకుండా వెళితే ఎవరు మాత్రం షాకవ్వకుండా ఉంటారు. బట్టల్లేక పోవడం అంటే పూర్తిగా నగ్నంగా అని మాత్రం ఊహించుకోవద్దు. షర్టు లేకుండా బిగ్ బాస్ ఇంట్లోకి 'అర్జున్ రెడ్డి' ఫేం విజయ్ దేవరకొండ ఎంట్రీ ఇవ్వబోతున్నారట.

    ఎందుకలా అంటే?

    ఎందుకలా అంటే?

    విజయ్ దేవరకొండ నటించిన ‘గీతా గోవిందం' మూవీ ఆగస్టు 15న విడుదల కాబోతోంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా విజయ్ దేవరకొండ హీరోయిన్ రష్మికతో కలిసి బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారట. అయితే షర్టు లేకుండా రావడం ద్వారా తన రౌడీ బ్రాండ్ దుస్తులు కూడా ప్రమోట్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

    కెఎల్ఎం కూడా తోడైంది

    కెఎల్ఎం కూడా తోడైంది

    ‘రౌడీ' పేరుతో తన సొంత దుస్తుల బ్రాండ్ లాంచ్ చేసిన విజయ్... ఇటీవల హైదరాబాద్‌లో భారీ ఎత్తున సన్‌డౌనర్ పార్టీ ఏర్పాటు చేశారు. కెఎల్ఎం ఫ్యాషన్ మాల్‌కు కూడా విజయ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ 2 అఫీషియల్ పార్ట్‌నర్‌లలో కెఎల్ఎం ఫ్యాషన్ మాల్ కూడా ఉండటం, అతడి రౌడీ బ్రాండ్ దుస్తులను ఈ మాల్ ఎక్స్‌క్లూజివ్‌గా కూడా విక్రయిస్తున్న నేపథ్యంలో..... విజయ్ షర్ట్ లెస్ బిగ్ బాస్ ఎంట్రీ నిజమే అనే వాదనకు బలం చేకూరుతోంది.

    హైదరాబాద్‌లో భారీ కటౌట్స్

    హైదరాబాద్‌లో భారీ కటౌట్స్

    రౌడీ బ్రాండ్ ప్రమోషన్లలో భాగంగా హైదరాబాద్‌లో విజయ్ దేవరకొండ షర్ట్‌లెస్ ఫోజులతో కూడిన భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు.

    రౌడీ యాప్‌కు ఊహించని స్పందన

    రౌడీ యాప్‌కు ఊహించని స్పందన

    విజయ్ దేవరకొండ లాంచ్ చేసిన ‘రౌడీ' యాప్‌కు కూడా భారీ రెస్పాన్స్ వచ్చింది. ఒక్క రాత్రిలోనే దాదాపు లక్ష మంది ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకున్నారు.

    English summary
    Actor Vijay Deverakonda is reportedly going to be the latest celebrity guest on Nani's Bigg Boss Telugu 2. The buzz in the media is that the Geetha Govindam actor will enter the house in a shirtless avatar.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X