సెన్సేషన్: ప్రభాస్, విజయ్ దేవరకొండ మల్టీస్టారర్.. ఎవరు ప్లాన్ చేశారో తెలిస్తే!
గతంలో కంటే ఇప్పుడు తెలుగు సినిమా స్థాయి భారీగా పెరిగిపోయింది. దీంతో మన హీరోల్లో చాలా మంది పాన్ ఇండియా రేంజ్ మూవీలు చేస్తున్నారు. అందులో రెబెల్ స్టార్ ప్రభాస్ పేరు ముందుగా చెప్పాలి. అంతలా అతడు ఈ మధ్య కాలంలో భారీ ప్రాజెక్టుల్లోనే భాగం అవుతున్నాడు.
ఇలా ఇప్పుడు చాలా సినిమాలను లైన్‌లో పెట్టుకున్నాడు. వాటిలో ఓ మూవీని మల్టీస్టారర్‌గా చేస్తున్నట్లు తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. అందులో టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్నాడట. ఇంతకీ అదేం సినిమా? ఆ పూర్తి వివరాలను మీరే చూసేయండి!

సక్సెస్ ట్రాక్‌తో ఫుల్ జోష్
'బాహుబలి' తర్వాత చాలా సినిమాలు చేసినా హిట్ కొట్టని ప్రభాస్ గత ఏడాది.. వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూనే వెళ్తున్నాడు. ఇలా గత ఏడాది వచ్చిన 'సలార్: సీజ్‌ఫైర్'తో మరోసారి సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు ఈ రెబెల్ స్టార్ హీరో 'కల్కి 2898 ఏడీ', 'సలార్ 2', 'రాజా సాబ్' వంటి చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నాడు.

సందీప్ రెడ్డి వంగాతోనూ
రెబెల్ స్టార్ ప్రభాస్.. కొంత కాలంగా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా తన 25వ సినిమాను కూడా ప్రకటించాడు. అర్జున్ రెడ్డి ఫేం సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించే ఈ సినిమాకు 'స్పిరిట్' అనే టైటిల్ పెట్టారు. దీన్ని పాన్ వరల్డ్ రేంజ్‌లో ఎనిమిది భాషల్లో రూపొందిస్తున్నారు. దీన్ని భూషన్ కుమార్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
భారీగా పెరిగిన అంచనా
ప్రభాస్ - సందీప్ రెడ్డి వంగా కాంబోలో రాబోతున్న 'స్పిరిట్' సినిమాకు సంబంధించిన ప్రకటన వెలువడి ఎన్నో రోజులే అవుతోన్నా.. వీళ్లిద్దరూ వేరే వేరే చిత్రాలతో బిజీగా ఉండడంతో ఇప్పటి వరకూ చిత్రీకరణ మాత్రం మొదలవలేదు. కానీ, ఈ చిత్రంపై అంచనాలు మాత్రం క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. అందుకు తగ్గట్లుగానే దీన్ని తెరకెక్కించాలని వ్యూహాలు రెడీ చేస్తున్నారు.

ఆ స్టోరీతోనే.. త్వరలోనే
వైల్డ్ యాక్షన్ జోనర్‌లో రాబోతున్న 'స్పిరిట్' మూవీ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ స్టోరీతో తెరకెక్కుతున్నట్లు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా వెల్లడించాడు. ఈ చిత్రం 'యానిమల్' కంటే హై రేంజ్‌లో ఉండబోతుందని కూడా తెలిపాడు. ఇక, త్వరలోనే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలు పెడుతున్నట్లు కూడా చెప్పాడు. అది పూర్తైన వెంటనే షూట్ స్టార్ట్ చేయబోతున్నారట.
మల్టీస్టారర్‌గా స్పిరిట్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న 'స్పిరిట్'ను మల్టీస్టారర్‌గా రూపొందించబోతున్నట్లు తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఇందులో మరో హీరోగా టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండను తీసుకుంటున్నట్లు ఫిలిం నగర్ ఏరియాలో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన స్టోరీ లైన్‌ను సైతం సందీప్ రెడ్డి వంగా అతడికి చెప్పేశాడని అంటున్నారు.

అలాంటి పాత్రలోనే
'స్పిరిట్' సినిమాలో విజయ్ దేవరకొండ నటిస్తున్నాడన్న వార్తతోనే.. అతడు ఇందులో ఏ రోల్ చేయబోతున్నాడు అనే సమాచారం కూడా బయటకు వచ్చింది. దీని ప్రకారం.. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ 'అర్జున్ రెడ్డి' తరహా వైల్డ్ రోల్‌లోనే కనిపిస్తాడట. దీన్ని సందీప్ రెడ్డి వంగా మరింత క్రేజీగా డిజైన్ చేయబోతున్నట్లు సమాచారం. దీంతో ఈ న్యూస్ సెన్సేషన్ అవుతోంది.


Click it and Unblock the Notifications











