విజయ్ దేవరకొండ నయా బిజినెస్.. మహేష్ బాబును ఫాలో అవుతున్నాడా?

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కొత్త బిజినెస్ ప్రారంభించనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే రౌడీ బ్రాండ్ పేరిట దుస్తుల అమ్మకాలు ప్రారంభించిన ఈ యంగ్ హీరో మరో అడుగు ముందుకేస్తున్నాడని సమాచారం. సూపర్ స్టార్ మహేష్ బాబు బాటలోనే విజయ్ దేవరకొండ కూడా మల్టీప్లెక్స్ థియేటర్ బిజినెస్ లోకి ఎంటర్ కాబోతున్నాడట.

టాలీవుడ్‌లో అడుగుపట్టిన అనతికాలంలోనే తనకంటూ ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ ఏషియన్ సినిమాస్‌తో చేతులు కలిపి మల్టీప్లెక్స్ థియేటర్ వ్యాపారంలోకి రాబోతున్నట్లు తెలిసింది. మహబూబ్ నగర్‌లో ఏవీడీ పేరుతో తొలి మల్టీప్లెక్స్ థియేటర్‌ను స్టార్ట్ చేయబోతున్నారట విజయ్ దేవరకొండ. గతేడాది మహేష్ బాబుతో కలిసి ఏఎంబీ సినిమాను స్టార్ట్ చేసిన ఇదే ఏషియన్ సంస్థ ఇప్పుడు విజయ్ దేవరకొండతో చేతులు కలపడం గమనార్హం.

 Vijay Deverakonda starts a new business?

ఇక విజయ్ దేవరకొండ సినిమాల విషయానికొస్తే.. ఇటీవలే 'డియర్ కామ్రేడ్' రూపంలో డిజాస్టర్ ఖాతాలో వేసుకున్న ఈ హీరో ఈ ఏడాది లవర్స్ డే కానుకగా వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన నాలుగు హీరోయిన్లు నటిస్తుండటం విశేషం. అలాగే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మరో సినిమా చేసుందుకు రెడీ అవుతున్నాడు ఈ రౌడీ స్టార్. అతి త్వరలో ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X