విజయ్ దేవరకొండ షార్ట్ బ్రేక్.. ఒక్కదానితోనే సరిపెట్టేస్తున్నాడుగా!
సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన కొద్ది రోజులకే ఎంతో క్రేజ్‌ను సంపాదించుకున్నాడు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ. కెరీర్ ఆరంభంలోనే 'పెళ్లి చూపులు', 'అర్జున్ రెడ్డి', 'గీత గోవిందం' వంటి సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకుని స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. అదే సమయంలో తన మార్కెట్‌ను కూడా గణనీయంగా పెంచుకున్నాడు. దీంతో విజయ్‌కు భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో విజయ్ సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని ఓ సంచలన నిర్ణయం తీసుకున్నాడట. ఇంతకీ అతడు సినిమాలెందుకు చేయడం లేదు.? పూర్తి వివరాల్లోకి వెళితే....

రెండింటితో పూర్తిగా మారిపోయిన పరిస్థితి
విజయ్ దేవరకొండ కెరీర్ ఆరంభంలోనే పలు విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే, ఈ మధ్య అతడి గ్రాఫ్ క్రమంగా డౌన్ అవుతోంది. దీనికి కారణం ఇటీవల ఈ క్రేజీ స్టార్ చేసిన ‘నోటా', ‘డియర్ కామ్రేడ్', ‘వరల్డ్ ఫేమస్ లవర్' వంటి సినిమాలు పరాజయం పాలవ్వడమే. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ మూవీలన్నీ ఫెయిలవడంతో విజయ్‌కు నిరాశ తప్పడం లేదు.

డైనమిక్ డైరెక్టర్‌తో కలిసిన క్రేజీ హీరో
వరుస పరాజయాలతో ఇబ్బందులను ఎదుర్కొంటోన్న విజయ్ దేవరకొండ.. ప్రస్తుతం టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌తో సినిమా చేస్తున్నాడు. పూరీ సొంత బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాకు ఛార్మీ సహా నిర్మాత. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా చేస్తోంది. ముంబై శివార్లలో ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది.

ఆయన ఎంట్రీతో మొత్తం మారిపోయింది
క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమాను మొదట తెలుగులో మాత్రమే రూపొందించాలని భావించారు. అయితే, బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ ఈ మూవీ స్క్రిప్టు చూసిన తర్వాత సహా నిర్మాతగా చేరారు. దీంతో దీనిని పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నారు. అందుకే ఈ సినిమా టైటిల్‌ను ‘ఫైటర్' నుంచి ‘లైగర్'కు మారుస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

విజయ్ దేవరకొండ సంచలన నిర్ణయం
విజయ్ దేవరకొండ హీరోగానే కాకుండా నిర్మాతగానూ అవతారమెత్తిన విషయం తెలిసిందే. ఇందుకోసం ‘కింగ్ ఆఫ్ ది హిల్' అనే బ్యానర్‌ను సైతం ప్రారంభించాడు. ఇప్పటికే తన బ్యానర్‌లో ఓ మూవీని కూడా నిర్మించాడు. అయితే, ఇకపై నిర్మాతగా సినిమాలు చేయకూడదని విజయ్ నిర్ణయించుకున్నట్లు ఓ న్యూస్ తాజాగా బయటకు వచ్చింది.
Recommended Video

ఒక్కదానితోనే సరిపెట్టేస్తున్నాడుగా.!
తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం, అనసూయ భరద్వాజ్, వాణి భోజన్, పావని గంగిరెడ్డి, నవీన్ జార్జ్ థామస్ వంటి నటులతో తెరకెక్కిన చిత్రం ‘మీకు మాత్రమే చెప్తా'. విజయ్ నిర్మించిన ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. అదే సమయంలో కలెక్షన్లు కూడా బాగానే రాబట్టింది. ఈ క్రమంలో అతడు మరిన్ని సినిమాలు నిర్మిస్తాడని అనుకుంటే, ఇప్పుడీ వార్త లీక్ అవడం షాకిస్తోంది.


Click it and Unblock the Notifications











