సందీప్ రెడ్డి సాయం కోరిన విజయ్ దేవరకొండ.. ఆయన రియాక్షన్ ఏంటంటే!
టాలీవుడ్ క్రేజీ స్టార్ తన కొత్త సినిమా విషయమై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సాయం కోరాడని తెలుస్తోంది. ఇటీవలే విడుదలైన 'డియర్ కామ్రేడ్' సినిమా ఫ్లాప్ విజయ్ దేవరకొండ కెరీర్‌కి చిన్న కుదుపు లాంటింది. దీంతో తన తదుపరి సినిమాపై ప్రత్యేక శ్రద్ద పెట్టాడట ఈ రౌడీ స్టార్. ఈ మేరకు తన సూపర్ డూపర్ హిట్ సినిమా 'అర్జున్ రెడ్డి' డైరెక్ట్ చేసిన సందీప్ రెడ్డి వంగా సలహాలు కోరాడట విజయ్.
క్రాంతి మాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా కొత్త సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రీసెంట్‌గా ఈ సినిమాకు 'వరల్డ్ ఫేమస్ లవర్' అనే టైటిల్ ఫిక్స్ చేసి ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో తనదైన స్టైల్ రఫ్ లుక్‌లో కనిపించాడు విజయ్ దేవరకొండ. ఇలా ఈ సినిమాలో కూడా రఫ్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉంటాయని చెప్పకనే చెప్పేశారు మేకర్స్.

అయితే 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమా ద్వారా ఎలాగైనా హిట్ కొట్టి మళ్లీ సక్సెస్ ట్రాక్‌లోకి రావాలని ఫిక్స్ అయిన ఈ కుర్ర హీరో.. సందీప్ రెడ్డి వంగాను సాయం కోరాడట. 'వరల్డ్ ఫేమస్ లవర్' చిత్రానికి సంబంధించి యూత్ ని ఆకట్టుకునేలా కొన్ని సూచనలు ఇవ్వాలని అడిగాడట. ఇందుకు సందీప్ రెడ్డి కూడా ఓకే చెప్పినట్లు టాక్ నడుస్తోంది. ఇది గనక నిజమే అయితే మరోసారి మరింత రఫ్‌గా విజయ్ దేవరకొండను చూసేయొచ్చు.


Click it and Unblock the Notifications











