సీక్రెట్ రివీల్ చేసిన సందీప్ రెడ్డి వంగా.. విజయ్ దేవరకొండతో కన్ఫమ్!
సందీప్ రెడ్డి వంగా, విజయ్ దేవరకొండ పేర్లు వినగానే ఎవ్వరికైనా ముందుగా గుర్తొచ్చే సినిమా 'అర్జున్ రెడ్డి'. విజయ్ దేవరకొండకు హీరోగా, సందీప్ రెడ్డి వంగాకు దర్శకుడిగా కెరీర్ టర్నింగ్ పాయింట్ అయింది ఈ సినిమా. ఎన్నో వివాదాలు చుట్టుముట్టినా సందీప్ రెడ్డి వంగా, విజయ్ దేవరకొండ ఇద్దరి టాలెంట్ బయటపెట్టింది 'అర్జున్ రెడ్డి' సినిమా. దీంతో ఈ కాంబోపై స్పెషల్ క్రేజ్ నెలకొంది.
అర్జున్ రెడ్డి తర్వాత వరుస సినిమా అవకాశాలు పట్టేసిన విజయ్ దేవరకొండ.. ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్నాడు. ఇటీవలే డియర్ కామ్రేడ్ రూపంలో ప్రేక్షకుల ముందుకొచ్చి ప్రస్తుతం వరల్డ్ ఫేమస్ లవర్‌గా సెట్స్ పై కదులుతున్నాడు. మరోవైపు సందీప్ రెడ్డి వంగా కూడా డైరెక్టర్ గా బిజీ అయ్యాడు. కబీర్ సింగ్ పేరుతో అర్జున్ రెడ్డి సినిమాను రీమేక్ చేసి బాలీవుడ్‌లో భారీ సక్సెస్ సాధించాడు. ప్రస్తుతం అదే బాలీవుడ్‌లో మరో సినిమా చేస్తున్నట్లుగా ప్రకటించాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

కాగా ఇటీవలే జరిగిన ఓ ఇంటర్వ్యూలో సందీప్ రెడ్డి వంగా ఓ సీక్రెట్ రివీల్ చేసాయడం హాట్ టాపిక్ అయింది. హిందీలో చేయనున్న ఈ ప్రాజెక్టు తర్వాత తన సినిమా విజయ్ దేవరకొండతోనే ఉంటుందని సందీప్ చెప్పాడు. అంటే విజయ్ దేవరకొండతో మరో సినిమా చేసేందుకు సందీప్ ఫిక్స్ అయ్యాడన్నమాట. ఈ లెక్కన టాలీవుడ్‌లో సందీప్ రెండో సినిమా కూడా విజయ్ దేవరకొండతోనే ఉంటుందని కన్ఫమ్ అయినట్లే కదా!. వచ్చే ఏడాది ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా రూపొందే అవకాశాలు కనిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











