twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పూరీ - విజయ్ ‘ఫైటర్’ గురించి బయటికొచ్చిన సెన్సేషనల్ న్యూస్.. కెరీర్‌లో ఫస్ట్ టైమ్.. ఫ్యాన్స్‌కు పండగ

    |

    ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' హిట్‌తో ఊపుమీదున్న పూరీ జగన్నాథ్ - 'డియర్ కామ్రేడ్' ఫలితంతో ఢీలా పడిన విజయ్ దేవరకొండ కలిసి సినిమా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. క్రేజీ కాంబినేషన్‌ కావడంతో ఈ సినిమాపై అప్పుడే ఊహాగానాలు, అంచనాలు ప్రారంభమయ్యాయి. అలాగే, ఎన్నో ఆసక్తికరమైన అంశాలు కూడా తెరపైకి వస్తున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఫిలింనగర్‌లో హల్‌చల్ చేస్తోంది. ఇంతకీ ఏంటా వార్త..? పూర్తి వివరాల్లోకి వెళితే..

    Recommended Video

    Puri Jagannath & Vijay Devarakonda's New Movie Title Has Been Fixed || Filmibeat Telugu
    పూరీ, విజయ్.. మాస్ మసాలా కథ

    పూరీ, విజయ్.. మాస్ మసాలా కథ

    విజయ్ దేవరకొండతో చేయబోయే సినిమా కోసం పూరీ జగన్నాథ్ పక్కా మాస్ మసాలా కథను రెడీ చేసినట్లు తెలుస్తోంది. తన గత చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్' హిట్ తర్వాత ఇకపై మాస్ సినిమాలే చేస్తానని ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగానే మరో మాస్ స్టోరీని సిద్ధం చేసేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇందుకు అనుగుణంగానే విజయ్ తన బాడీ లాగ్వేజ్ మార్చుకోబోతున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.

    సొంత బ్యానర్‌పైనే

    సొంత బ్యానర్‌పైనే

    త్వరలో పట్టాలెక్కబోతున్న ఈ సినిమాను పూరీ తన సొంత బ్యానర్‌లో చేయనున్నాడు. పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌, పూరి కనెక్ట్స్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. పూరి, ఛార్మి నిర్మాతలు. ప్రొడక్షన్ బాధ్యతలు ఛార్మీ దగ్గరుండి చూసుకోనుంది. ఈ చిత్రాన్ని లావణ్య సమర్పిస్తున్నారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే ప్రకటించనున్నట్టు చిత్ర యూనిట్‌ తెలిపిన విషయం తెలిసిందే.

     జాన్వీ కపూర్‌ను తీసుకొస్తున్నారట

    జాన్వీ కపూర్‌ను తీసుకొస్తున్నారట

    పూరీ జగన్నాథ్ - విజయ్ దేవరకొండ సినిమాలో ఎవరూ ఊహించని ఓ హీరోయిన్‌ను నటింపజేస్తున్నారని తెలుస్తోంది. ఆమె మరెవరో కాదు.. అలనాటి అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్. అందంలో తల్లికి ఏమాత్రం తీసిపోనంతగా ఉండే ఈ అమ్మడు.. తొలి సినిమాలోనే నటనతో మెప్పించి విమర్శకుల ప్రసంశలు అందుకుంది. ఈ ఊపులోనే మరికొన్నిసినిమాలకూ సంతకాలు చేసేసింది.

    టైటిల్ బయటికొచ్చేసింది

    టైటిల్ బయటికొచ్చేసింది

    క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమాకు ‘ఫైటర్' అనే టైటిల్ పెట్టబోతున్నారని తాజాగా ఓ వార్త బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ టైటిల్‌ను ఫిలిం ఛాంబర్లో రిజిస్టర్ కూడా చేశారని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా పూజా కార్యక్రమాలు అక్టోబర్‌లో జరగనున్నాయని, ఆ తర్వాత అంటే జనవరి నుంచి రెగ్యూలర్ షూటింగ్ జరగనుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

    ఎవరూ ఊహించిన పాత్రలో విజయ్

    ఎవరూ ఊహించిన పాత్రలో విజయ్

    ఈ సినిమాలో విజయ్ దేవరకొండ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్‌గా కనిపిస్తాడని తెలుస్తోంది. ప్రస్తుతం క్రాంతి మాధవ్ సినిమాలో నటిస్తున్న విజయ్.. అది పూర్తయిన వెంటనే మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకోడానికి ‘థాయ్‌లాండ్' వెళ్తాడని తెలుస్తోంది. ఈ సినిమా మొత్తం మార్షల్ ఆర్ట్స్ బ్యాగ్ డ్రాప్‌లోనే నడుస్తుందట. అందుకే దీనికి ‘ఫైటర్' అనే పేరు పెట్టబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ లోపు పూరీ స్క్రిప్టు వర్క్ పూర్తి చేస్తాడని టాక్.

    English summary
    Vijay Devarakonda’s career graph skyrocketed with Arjun Reddy. The film was a massive success and he went on to become the hottest star in Tollywood. According to the latest buzz doing rounds, veteran filmmaker Puri Jagannath is planning to make a film with Vijay Devarakonda.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X