Don't Miss!
- News Astrology: రేపటి నుంచి ఈ రాశులకు అఖండ ధనయోగం
- Sports SRH vs RCB: అందుకే వాషింగ్టన్ సుందర్‌పై వేటు వేసాం: ప్యాట్ కమిన్స్
- Technology వన్‌ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నిర్మాతగా విజయ్ దేవరకొండ.. క్రేజీ దర్శకుడిని హీరోగా పెట్టి సినిమా..ఎవరా డైరెక్టర్ అంటే!
పెళ్లిచూపులు చిత్రం తర్వాత విజయ్ దేవరకొండ క్రేజీ ప్రాజెక్టులతో బాక్సాఫీస్‌ను రఫాడిస్తున్నాడు. వరుస సక్సెస్‌లతో ఈ అర్జున్ రెడ్డి హీరో ఫుల్ స్పీడ్‌తో సినిమాల జోరును పెంచేశాడు. అయితే హీరోగా సినిమాలు చేస్తూనే బిజినెస్‌పై కూడా ఈ మధ్య దృష్టిపెట్టారు. అయితే ఇదే ఊపులో విజయ్ దేవరకొండ నిర్మాతగా మారనున్నారనేది టాలీవుడ్ వర్గాల టాక్. అంతేకాకుండా ఓ యువ క్రేజీ డైరెక్టర్‌ను హీరోగా మార్చబోతున్నారట. ఇంతకీ ఎవరా డైరెక్టర్ అంటే..
డియర్ కామ్రేడ్‌తో బిజీగా
అర్జున్ రెడ్డి బంపర్ హిట్ తర్వాత నోటా చిత్రం కాస్త నిరాశ పరిచినా వెంటనే టాక్సీవాలా చిత్రంతో విజయ్ దేవరకొండ సెటిల్ అయిపోయాడు. టాక్సీవాలా సినిమా మొత్తం లీక్ అయినప్పటికీ.. ఆ చిత్రం భారీ వసూళ్లను సాధించింది. ఆ తర్వాత ప్రస్తుతం డియర్ కామ్రేడ్ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లాడు. ఈ ఏడాది మధ్యలో సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.
బిజినెస్, బ్రాండింగ్‌తో హంగామా
సినిమాలను చకచకా పూర్తి చేస్తూనే బిజినెస్ కార్యక్రమాలపై కూడా దృష్టిపెట్టాడు. రౌడీ బ్రాండ్‌ను మార్కెట్లోకి తెచ్చి యూత్‌ను విశేషంగా ఆకర్షించాడు. ప్రస్తుతం ఫ్యాబ్రిక్ మార్కెట్లో రౌడీ క్రేజీ ప్రొడక్ట్‌గా మారింది. ఇలా రకరకాల వ్యవహారాలను సమర్దంగా నిర్వహిస్తూనే సినీ నిర్మాణంలోకి అడుగుపెడుతున్నాడు.
నిర్మాతగా విజయ్ దేవరకొండ
త్వరలోనే విజయ్ దేవరకొండ సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించి ఓ చిన్న బడ్జెట్ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ చిత్రంలో తన కెరీర్‌కు మంచి బ్రేక్ ఇచ్చిన దర్శకుడు తరుణ్ భాస్కర్‌ను హీరోగా మార్చబోతున్నట్టు సమాచారం.
తరుణ్ భాస్కర్ గ్రీన్ సిగ్నల్
తన బాడీ లాంగ్వేజ్‌కు తగిన కథను తరుణ్ భాస్కర్ ఒకే చేసినట్టు సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన పీ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నట్టు తెలిసింది. త్వరలోనే అధికారికంగా సినిమా వివరాలను వెల్లడించే అవకాశం ఉంది.