గుడ్ ఐడియా: 20 నిముషాలు ట్రిమ్ చేస్తున్నారు
హైదరాబాద్ : సినిమా విజయానికి కథ ఎంత ముఖ్యమో..లెంగ్త్ కూడా అంతే ప్రాముఖ్యతని సంతరించుకున్న సంగతి తెలిసిందే. చాలా సినిమాలు విడుదల తర్వాత లెంగ్త్ కట్ చేయటం గమనిస్తూనే ఉన్నాము. అయితే దాని వల్ల పెద్దగా ప్రయోజనం కనపడటం లేదనుకోండి..అది వేరే సంగతి. ఈ విషయాలన్ని గమనించి విజయ్ తమిళ చిత్రం కత్తి ని తెలుగులోకి డబ్ చేస్తూ ఇరవై నిముషాలు ట్రిమ్ చేసి వదులుతున్నారు. ఈ చిత్రాన్ని నవంబర్ 21 న కానీ 28న కానీ విడుదల అయ్యే అవకాసం ఉంది. ప్రస్తుతం రీరికార్డింగ్ జరుగుతోంది.
నిర్మాత ఠాగూర్ మధూ మాట్లాడుతూ...తెలుగు వెర్షన్ ని కొంచెం ట్రిమ్ చేసాం. ప్రస్తుతం రీ రికార్డింగ్ జరుగుతోంది అన్నారు. తమిళ వెర్షన్ ..రెండు గంటల 46 నిముషాలు. తెలుగుకి వచ్చేసరికి రెండు గంటల 26 నిముషాలు మాత్రమే ఉండబోతోందని తెలుస్తోంది. ఏఆర్ మురుగదాస్, విజయ్ కాంబినేషన్లో తెరకెక్కిన రెండో చిత్రం 'కత్తి'. విజయ్‌తో సమంత తొలిసారిగా జతకట్టిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం సమకూర్చారు.

ఇక మురుగదాస్ కథలన్నీ విభిన్నంగా ఉంటాయి. షార్ట్ టర్మ్ మొమొరీ లాస్ అనే కథాంశంతో 'గజిని' తీర్చిదిద్దారు. 'రమణ', 'సెవెన్త్‌సెన్స్', 'తుపాకీ' కూడా సాధారణ సినిమాలకు విభిన్నంగా సాగేవే. అందుకే మురుగదాస్ సినిమా వస్తోందంటే అందరిలోనూ ఆసక్తి. ఇప్పుడాయన 'కత్తి' పదును చూపించబోతున్నారు. విజయ్, సమంత జంటగా నటించిన చిత్రమిది. కె.కరుణామూర్తి, ఎ.శుభాస్కరన్ సంయుక్తంగా నిర్మించారు.
చిత్ర సమర్పకుడు ఠాగూర్ మధు మాట్లాడుతూ ''థ్రిల్లర్ నేపథ్యంలో సాగే యాక్షన్ చిత్రమిది. సెంటిమెంట్‌కీ చోటుంది. అనిరుథ్ స్వరాలు అదనపు ఆకర్షణ. త్వరలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ''న్నారు.


Click it and Unblock the Notifications











