twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మెగా ఫ్యామిలీ నుంచి మరో వారసుడు... స్టార్ హీరోను విలన్‌గా సెట్ చేస్తున్నారా?

    |

    తమిళ సినీ ఇండస్ట్రీలో నటుడిగా కెరీర్ మొదలు పెట్టి, హీరోగా అవకాశాలు దక్కించుకుని విభిన్నమైన చిత్రాలు, కథలు ఎంచుకుంటూ స్టార్ హీరో స్థాయికి ఎదిగిన విజయ్ సేతుపతి త్వరలో 'సైరా' మూవీ ద్వారా తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టబోతున్నాడు.

    తాజాగా విజయ్ సేతుపతి గురించి ఓ ఆసక్తికర న్యూస్ ఫిల్మ్ నగర్ సర్కిల్‌లో చక్కర్లు కొడుతోంది. అతడితో విలన్ రోల్ చేయించేందుకు ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.

    మెగా ఫ్యామిలీ నుంచి మరో వారసుడు

    మెగా ఫ్యామిలీ నుంచి మరో వారసుడు

    మెగా ఫ్యామిలీ నుంచి త్వరలో మరో వారసుడు వెండి తెరకు పరిచయం కాబోతున్నాడు. సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ నటుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించబోతున్నారు.

    విజయ్ సేతుపతి విలన్ రోల్

    విజయ్ సేతుపతి విలన్ రోల్

    బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రూపొందబోయే వైష్ణవ్ తేజ్ తొలి చిత్రంలో విలన్ పాత్ర కోసం విజయ్ సేతుపతిని సంప్రదించినట్లు తెలుస్తోంది. రూరల్ బ్యాక్ డ్రాపులో ఈ చిత్రం ఉంటుందని సమాచారం. విజయ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని, అయితే డేట్స్ ఇంకా కేటాయించలేదని టాక్. త్వరలో ఈ విషయంలో క్లారిటీ రానుంది.

    అతడిని ఎంపిక చేయడానికి కారణం...

    అతడిని ఎంపిక చేయడానికి కారణం...

    ఎంత మెగా ఫ్యామిలీకి చెందిన హీరో అయినా కొత్త హీరో లాంచ్ అయ్యేపుడు సినిమాపై మంచి అంచనాలు ఏర్పడాలంటే అందులో ఏదైనా ప్రత్యేకత ఉండాలి. అందుకే విలన్ పాత్రకు విజయ్ సేతుపతిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

    సుకుమార్ కథతో..

    సుకుమార్ కథతో..

    వైష్ణవ్ తేజ్ పరిచయం అయ్యే ఈ చిత్రానికి సుకుమార్ మూలకథ అందించినట్లు సమాచారం. అంతే కాదు ఈ చిత్రానికి ఆయన సహనిర్మాతగా వ్యవహరించబోతున్నట్లు తెలుస్తోంది. విజయ్ సేతుపతి డేట్స్ సెట్టయిన తర్వాత ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు అఫీషియల్‌గా వెల్లడించనున్నారు.

    English summary
    Film Nagar source said that, Vijay Sethupathi has been approached by Mythri Movie Makers for the film starring Sai Dharam Tej's brother Vaishnav Tej movie for villain role.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X