రానాకు హ్యాండిచ్చిన విజయ్.. ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లేనా.!

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో బయోపిక్‌ల శకం నడుస్తోంది. బాలీవుడ్ నుంచి కోలీవుడ్ దాక దేశంలోని ప్రతీ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు తెరకెక్కుతున్నాయి. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేయడానికి ఫిల్మ్ మేకర్లు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. దేశంలో ఉన్న గొప్పవాళ్లందరి పేర్లను పరిశీలిస్తున్నారు. వారి చరిత్రలను తిరగేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శ్రీలంక క్రికెట్ జట్టు మాజీ సభ్యుడు, స్పిన్ లెజెండ్ ముత్తయ్య మురళీధరన్ జీవిత చరిత్ర ఆధారంగా సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే.

కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ సేతుపతి.. లెజెండరీ స్పిన్నర్‌గా కనిపించనున్న ఈ సినిమాను టాలీవుడ్ యంగ్ హీరో దగ్గుబాటి రానా నిర్మిస్తున్న విషయం విధితమే. ఈ సినిమా కోసం ప్రస్తుతం విజయ్ సేతుపతి.. క్రికెట్ కోచ్‌ల దగ్గర ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నాడు. మరికొంత కాలం శిక్షణ తీసుకున్న తర్వాత ఆయన షూటింగ్‌కు వెళ్తారని చెబుతున్నారు.

Vijay Sethupathi Gave Shock To Rana Daggubati

ఇప్పటికే ఎన్నో పాత్రలతో విలక్షణ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్.. మురళీధరన్ పాత్రలోనూ కచ్చితంగా మెప్పిస్తాడని అంతా అనుకుంటున్నారు. అంతేకాదు, ఈ సినిమా ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా అన్న ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇది ప్రస్తుతం రెండు ఇండస్ట్రీలలో హాట్ టాపిక్ అవుతోంది.

అదే.. ఈ సినిమా నుంచి విజయ్ సేతుపతి తప్పుకుంటున్నాడన్న వార్త. కారణాలు ఏమై ఉంటాయన్న దానిపై క్లారిటీ లేదు కానీ, ఈ సినిమా చేయకూడదని ఆయన నిర్ణయించుకున్నాడని ఓ వార్త బయటకు వచ్చింది. కొద్దిరోజుల్లో పట్టాలెక్కుతుందనుకుంటున్న సమయంలో ఈ వార్త బయటకు రావడం చర్చనీయాంశం అవుతోంది. దీంతో ఇది తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో చక్కర్లు కొడుతోంది. ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు వేచి చూడక తప్పదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X