ప్రభాస్ vs విజయ్ సేతుపతి.. గూస్ బంప్స్ తెప్పించే న్యూస్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇండియన్ బిగ్గెస్ట్ యాక్టర్ గా కీర్తి పొందుతున్న సంగతి తెలిసిందే. బాహుబలి తర్వాత నుంచి ప్రభాస్ నుంచి అత్యధిక బడ్జెట్ చిత్రాలు రూపుదిద్దుకుంటున్నాయి. ఇప్పటికే ప్రభాస్ నుంచి సలార్, కల్కి 2898 ఏడీ చిత్రాలు విడుదలై ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేశాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రభాస్ నుంచి మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్ విడుదలకు సిద్ధం కానున్నాయి. ఈ క్రమంలో ఆ చిత్రాల నుంచి ఎగ్జైటింగ్ న్యూస్ ఎప్పటికప్పుడు బయటికి వస్తూనే ఉంది.
కాగా ప్రభాస్ లైన్ అప్ లో ఉన్న మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో స్పిరిట్ ఒకటి. ఈ చిత్రానికి సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ త్వర త్వరగా పూర్తి చేస్తున్నారు. కాస్ట్ అండ్ క్రూ ఎంపికను కూడా వేగవంతం చేశారు. త్వరలో సెట్స్ మీదకు వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో స్పిరిట్ నుంచి గూస్ బంప్స్ తెంపించే వార్తలు ఫిలిం సర్కిల్స్ లో చెక్కర్లు కొడుతూనే ఉన్నాయి.

ఇక తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందింది. స్పిరిట్ చిత్రంలో భారీ తారాగణం నటించబోతుందనే విషయం ఆసక్తికరంగా మారింది. ప్రభాస్ ను సందీప్ రెడ్డి వంగ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా చూపించబోతున్నారు. ఇక ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా నెగిటివ్ పాత్రల్లో నటించేందుకు పలువురు హీరోల పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే చైనీస్ నటుడు డాన్లీ పేరు గట్టిగా వినిపిస్తోంది. కాగా ఇప్పుడు మరో స్టార్ హీరో పేరు లిస్టులో చేరింది. ఆయన మరెవరో కాదు సహజ నటనతో ఇండియాలో సెన్సేషన్ క్రియేట్ చేసిన విజయ్ సేతుపతి కావడం విశేషం.
అయితే రీసెంట్ గా సందీప్ రెడ్డి వంగ విజయ్ సేతుపతిని కలిశారని తెలుస్తోంది. ఆయన స్పీడ్ మూవీ నటీనటుల ఎంపికలో నిమగ్నమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సందీప్ రెడ్డి వంగ విజయ్ సేతుపతిని కలవడం హాట్ టాపిక్ గా మారింది. అతి సందీప్ రెడ్డి వంగ విజయ్ సేతుపతిని ఒక కీలక పాత్రలో నటించేందుకు అడగడం కోసమే కలిశారని తెలుస్తోంది. మరోవైపు విజయ్ సేతుపతి నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించబోతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఏది ఏమైనా మరికొద్ది రోజులు ఆగితే స్పష్టత రానుంది.
అయితే విజయ్ సేతుపతి ఇప్పటికే టాలీవుడ్ లో విలన్ పాత్రలు పోషించి ప్రేక్షకులను అలరించారు. కలర్ ఫోటో, ఉప్పెన, గతంలో సైరా నరసింహారెడ్డి వంటి చిత్రాలు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ క్రమంలోనే ప్రభాస్ వర్సెస్ విజయ్ సేతుపతిగా స్పిరిట్ వస్తే వేరే రేంజ్ లో ఉంటుందని ఆశిస్తున్నారు. ఇప్పటికే విజయ్ సేతుపతి కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ దళపతి కి మాస్టర్ సినిమాలో విలన్ గా నటించి దీటైన పర్ఫామెన్స్ ఇచ్చారు. ఇక స్పిరిట్ విషయంలో ఏం జరుగుతుందో వేచి చూడాలి. మరోవైపు ప్రభాస్ నుంచి రాజా సాబ్, ఫౌజీ చిత్రాల త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. మరోవైపు సలార్ 2, కల్కి 2898 ఏడీ సీక్వెల్ షూట్ కు కూడా సిద్ధమవుతున్నాయి.


Click it and Unblock the Notifications











