India
  For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Pushpa The Rule: పుష్ప 2లో మరో హీరో.. పవర్‌ఫుల్ రోల్‌లో స్టార్.. సినిమాలో అసలు ట్విస్ట్ అదేనట

  |

  గతంలో పోల్చుకుంటే ఈ మధ్య కాలంలో తెలుగు సినిమా స్థాయి భారీగా పెరిగిపోయిందనే చెప్పాలి. దీనికి కారణం మన పరిశ్రమ నుంచి వచ్చిన పాన్ ఇండియా మూవీలే. దర్శకధీరుడు రాజమౌళి చిత్రాలే కాదు.. ఆ తరహాలో మెప్పించగల ఇంకా చాలా మంది దర్శకులు టాలీవుడ్‌లో ఉన్నారని నిరూపిస్తూ వచ్చిన చిత్రమే 'పుష్ప'. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలై భారీ విజయాన్ని దక్కించుకుంది. దీంతో ఇప్పుడు దీనికి కొనసాగింపుగా చేసే 'పుష్ప ద రూల్'పై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ఆ సంగతులేంటో మీరే చూడండి!

  పాన్ ఇండియా రేంజ్ సక్సెస్

  పాన్ ఇండియా రేంజ్ సక్సెస్

  సుకుమార్ - అల్లు అర్జున్ కాంబినేషన్‌లో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన 'పుష్ప' మూవీ పాన్ ఇండియా రేంజ్‌లో దేశ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైంది. అందుకు అనుగుణంగానే అన్ని చోట్లా దీనికి భారీ రెస్పాన్స్ వచ్చి సూపర్ హిట్ అయింది. మరీ ముఖ్యంగా హిందీలో ఈ సినిమా వంద కోట్ల క్లబ్‌లో కూడా చేరిపోయింది. అలాగే, మిగిలిన చోట్లా ప్రభావాన్ని చూపించింది.

  స్విమ్మింగ్ పూల్‌లో రెచ్చిపోయిన హీరోయిన్: గతంలో చూడని విధంగా అందాల విందు

  అత్యధిక లాభాలతో రికార్డులు

  అత్యధిక లాభాలతో రికార్డులు

  మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'పుష్ప'కు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 144.90 కోట్లు మేర బిజినెస్ జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 146 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 175 కోట్లు పైగా వసూలు చేసింది. దీంతో హిట్ స్టేటస్‌తో పాటు రూ. 35 కోట్లకు పైగా లాభాలు కూడా సొంతం అయ్యాయి.

  రూల్ చేయడానికి బన్నీ రెడీ

  రూల్ చేయడానికి బన్నీ రెడీ

  గంథపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంతో రూపొందిన 'పుష్ప' మూవీ రెండు భాగాలుగా రాబోతున్న విషయం తెలిసిందే. మొదటి దాన్ని 'పుష్ప.. ద రైజ్' టైటిల్‌తో విడుదల చేశారు. అలాగే, ఇప్పుడు రెండో భాగానికి సంబంధించిన షూటింగ్ చేయనున్నారు. దీనికి 'పుష్ప.. ద రూల్' అనే టైటిల్ పెట్టారు. ఇందులో పుష్ప రూలర్‌గా ఎలా మారాడు అన్న విషయాన్ని చూపిస్తారు.

  హాట్ షోలో గీత దాటిన సీరియల్ నటి: ఆమెనిలా చూస్తే మతి పోవడం ఖాయం

  షూట్ స్టార్ట్ కాకున్నా ఆఫర్లతో

  షూట్ స్టార్ట్ కాకున్నా ఆఫర్లతో

  అల్లు అర్జున్ క్రేజ్ 'పుష్ప' మూవీతో దేశ వ్యాప్తంగా పెరిగిపోయింది. దీంతో రెండో పార్ట్‌కు సంబంధించిన షూటింగ్‌ను మరింత ఉత్సాహంగా జరపాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. త్వరలోనే దీన్ని ప్రారంభించాలని చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో షూటింగ్ మొదలు కాకుండానే ఈ సినిమాకు భారీ స్థాయిలో ఆఫర్లు వస్తున్నట్లు చాలా రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి.

  పుష్ప ద రూల్‌లో మరో స్టార్

  పుష్ప ద రూల్‌లో మరో స్టార్

  సక్సెస్‌ఫుల్ కాంబినేషన్‌లో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న 'పుష్ప ద రూల్' మూవీలో మరికొందరు పాన్ ఇండియా స్టార్లను భాగం చేయాలని దర్శకుడు సుకుమార్ భావిస్తున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. అందుకు అనుగుణంగానే చాలా మందిని సంప్రదిస్తున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగానే ఈ చిత్రం కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతిని భాగం చేస్తున్నారట.

  Ram Marriage: ప్రియురాలితో హీరో రామ్ పెళ్లి.. నిశ్చితార్థం, వివాహం అప్పుడే.. అమ్మాయి ఎవరంటే!

  పవర్‌ఫుల్ రోల్‌కు ఒప్పుకుని

  పవర్‌ఫుల్ రోల్‌కు ఒప్పుకుని

  'పుష్ప' మొదటి భాగంలో ఫహాద్ ఫాజిల్ పాత్ర ఎంట్రీ ఇచ్చిన కాసేపటే సినిమా కంప్లీట్ అవుతుంది. తద్వారా ఆయనే ఇందులో మెయిన్ విలన్ అని చూపించారు. అయితే, తాజా సమాచారం ప్రకారం.. పుష్ప ద రూల్‌లో విజయ్ సేతుపతి కోసం సుకుమార్ ఓ పవర్‌ఫుల్ రోల్‌ను క్రియేట్ చేశాడని తెలుస్తోంది. ఇది సినిమాలోనే హైలైట్‌గా నిలవబోతుందని ప్రచారం జరుగుతోంది.

  అసలు ట్విస్ట్ అదేనంటూ

  అసలు ట్విస్ట్ అదేనంటూ

  మొదటి భాగం సంచలన విజయాన్ని నమోదు చేసుకోవడంతో అల్లు అర్జున్ 'పుష్ప ద రూల్'పై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీన్ని మరింత హై ఓల్టేజ్ కంటెంట్‌తో రూపొందిస్తున్నారట. తాజా సమాచారం ప్రకారం.. ఇందులో విజయ్ సేతుపతి పాత్ర ఎంట్రీతో బిగ్ ట్విస్ట్ ఉంటుందట. అక్కడి నుంచి సినిమా వేరే లెవెల్‌కు చేరుతుందని టాక్.

  English summary
  Icon Star Allu Arjun will do Pushpa 2 Under Creative Director Sukumar Direction. Vijay Sethupathi to do Key Role in This Movie.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X