twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మణిరత్నంకు హీరో ఝలక్.. డేట్స్ కష్టమనడంతో సినిమా నుంచి అవుట్!

    |

    Recommended Video

    Kollywood Star Out From Mani Ratnam's Project || Filmibeat Telugu

    దక్షిణాదిలో మెరుపులా దూసుకొచ్చిన హీరోలలో విజయ్ సేతుపతి ఒకరు. ఇటీవల కాలంలో ఫెర్ఫార్మెన్స్‌తో ఇరుగదీస్తున్నారు. నవాబ్, 96 చిత్రాలు అందుకు సాక్ష్యంగా నిలిచాయి. తాజాగా ఆయన నటించిన సూపర్ డీలక్స్ చిత్రం భారీ సక్సెస్ దిశగా దూసుకెళ్తున్నది. ఇలా దక్షిణాది ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్న విజయ్ సేతుపతిని మణిరత్నం తన సినిమా నుంచి తొలగించారనే వార్త తమిళ చిత్రపరిశ్రమలో సంచలనం రేపింది. అసలేం జరిగిందంటే..

    మణిరత్నం తదుపరి చిత్రంలో

    మణిరత్నం తదుపరి చిత్రంలో

    మణిరత్నం, విజయ్ సేతుపతి కాంబినేషన్‌లో నవాబు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ చిత్రంలో బరువైన, ఫెర్ఫార్మెన్స్‌కు వీలున్న పాత్రలో విజయ్ సేతుపతి నటించి మెప్పించాడు. అయితే నవాబు తర్వాత మణిరత్నం తమిళంలో పన్నియిన్ సెల్వన్ అనే చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. ఆ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్థాయిలోనే ఉంది.

    పొన్నియిన్ సెల్వన్‌లో విజయ్ సేతుపతి పేరు

    పొన్నియిన్ సెల్వన్‌లో విజయ్ సేతుపతి పేరు

    పొన్నియిన్ సెల్వన్ సినిమాలో ఓ కీలకమైన పాత్ర కోసం విజయ్ సేతుపతిని సంప్రదించారని వార్త తమిళ చిత్ర పరిశ్రమలో కొద్దిరోజుల క్రితం వైరల్ అయింది. అయితే తాజాగా విజయ్ సేతుపతిని మణిరత్నం తన సినిమాకు సంబంధించి నటీనటులు జాబితా నుంచి తొలగించడం చర్చనీయాంశమైంది. అయితే ఆ నిర్ణయం వెనుక కారణం ఇలా వినిపిస్తున్నది.

    మణిరత్నం ఆఫర్‌కు నో చెప్పడంతో

    మణిరత్నం ఆఫర్‌కు నో చెప్పడంతో

    విజయ్ సేతుపతి క్షణం తీరిక లేకుండా ప్రస్తుతం పలు ప్రాజెక్టుల్లో నటిస్తున్నారు. ఈ క్రమంలో మణిరత్నం తన సినిమా కోసం సుమారు 200 రోజుల షెడ్యూల్‌ను వేసుకొన్నారట. ఆ షెడ్యూల్‌ కోసం విజయ్ సేతుపతిని సంప్రదించగా అందుకు ఆయన చేతులెత్తేశారట. దాంతో విజయ్ సేతుపతిని తీసుకోవాలనే నిర్ణయాన్ని మణిరత్నం ఉపసంహరించుకొన్నారట.

    సూపర్ డీలక్స్‌లో ట్రాన్స్‌జెండర్‌గా విజయ్ సేతుపతి

    సూపర్ డీలక్స్‌లో ట్రాన్స్‌జెండర్‌గా విజయ్ సేతుపతి

    విజయ్ సేతుపతి తాజాగా నటించిన సూపర్ డీలక్స్ మంచి టాక్‌ను సొంతం చేసుకొన్నది. ఈ చిత్రంలో ఆయన పోషించిన ట్రాన్స్ జెండర్ పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తున్నది. ఈ పాత్రలో ఒదిగిపోయారని ప్రేక్షకులు, సినీ విమర్శకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

    English summary
    Maniratnam's latest movie is Ponniyin Selvan. For this movie, He looked for Vijay Sethupati, But he is busy with multiple projects. So Mani Ratnam deleted his name from the list.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X