For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  విజయ్‌ను మోయలేకపోతోన్న నిర్మాతలు.. బడ్జెట్ పెరిగిపోతోందని టాక్

  |

  మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో రాబోతోన్న సంగతి తెలిసిందే. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇతగాడి సినిమా ఎప్పుడో మొదలైనా షూటాంగ్‌ నెమ్మదిగా జరుగుతుండటంతో వెండి తెరపై కనిపించేందుకు ఇంకాస్త సమయం ఉంది. 'ఉప్పెన‌' అంటూ రాబోతోన్న ఈ సినిమాను మైత్రీ మూవీస్‌ నిర్మిస్తోంది.

  సరైన హిట్ లేక వెనకబడ్డ మైత్రీ..

  సరైన హిట్ లేక వెనకబడ్డ మైత్రీ..

  అసలే మైత్రీ వారి పరిస్థతి ఇప్పుడు అంతంత మాత్రంగానే ఉందంటే.. ఉప్పెన తలకు మించిన భారమవుతోందని టాక్. రీసెంట్‌గా నిర్మించిన చిత్రాలేవీ మైత్రీకి లాభాలను కాదు కనీసం పెట్టిన సొమ్మును కూడా వెనక్కి రాబట్టలేకబోతోన్నాయి. మీడియం రేంజ్ హీరోలతో ఓ మోస్తరు సినిమాలు చేస్తోన్న ఈ సంస్థకు అవేవీ కలిసి రావడం లేదు. తాజాగా మెగా మేనల్లుడిని లాంచ్ చేసే బాధ్యతను మైత్రీ తీసుకుంది.

  మెగా అల్లుడిని లాంచ్ చేసే బాధ్యత..

  మెగా అల్లుడిని లాంచ్ చేసే బాధ్యత..

  మైత్రీ మూవీస్ బ్యాన‌ర్ వాల్యూ, మెగా అల్లుడి సినిమా అనే ట్యాగ్ తప్పా ఆకట్టుకునేందుకు ఇంకేమీ లేవు . అందుకే వీలైనంత స్టార్ క్యాస్టింగ్ జోడించాల‌ని మేకర్స్ ప్లాన్ వేశారు. అందుకే తమిళ స్టార్ మక్కల్ సెల్వన్ విజయ్‌ సేతుప‌తిని రంగంలోకి దింపింది. ఈ సినిమాలో విజ‌య్ ప్ర‌ధాన విల‌న్‌. ఎప్పుడైతే విజ‌య్‌సేతుప‌తి ఎంట్రీ ఇచ్చాడో అనుకున్న‌ట్టే ‘ఉప్పెన‌'కు క్రేజ్ వ‌చ్చింది. అయితే ఇప్పుడు విజ‌య్ సేతుప‌తి పారితోషికం పేరుతో.. నిర్మాత‌ల్ని పిండుకోవ‌డం ప్రారంభించాడ‌ని టాక్‌.

  భారంగా విజయ్ పారితోషికం..

  భారంగా విజయ్ పారితోషికం..

  ఈ సినిమా కోసం ముందుగా 2.5 కోట్ల‌కు ఒప్పందం జ‌రిగింది. అయితే మ‌ధ్య‌లో చిత్రీక‌ర‌ణ‌కు బ్రేక్ ప‌డటంతో కాల్షీట్లు పెరిగినట్లు టాక్. దాంతో విజ‌య్‌సేతుపతి పారితోషికాన్నీ పెంచేశాడని తెలుస్తోంది. ముందుగా అనుకున్న దాని కంటే మ‌రో 1.5 కోట్లు డిమాండ్ చేస్తున్నాడ‌ని తెలుస్తోంది. విజ‌య్‌ సేతుప‌తిపై తెర‌కెక్కించాల్సిన సన్నివేశాలు ఇంకా ఉండటంతోఅతను అడిగినంత ఇవ్వ‌క త‌ప్ప‌డం లేదని టాక్.

  #CineBox : Fans Begin Countdown For RRR,With #250daystomassiveRRR
   నిదానంగా షూటింగ్..

  నిదానంగా షూటింగ్..

  ఈ సినిమాలో విజ‌య్ సేతుప‌తి పాత్ర దాదాపు గంటపాటు ఉంటుంద‌ని టాక్. విజ‌య్‌లాంటి స్టార్‌ క్యాస్ట్‌ను తీసుకొచ్చిన‌ప్పుడు అతనికి సంబంధించిన పార్ట్‌ను చ‌కచ‌కా తీసేసి, కాల్షీట్ల స‌మ‌స్య రాకుండా చూసుకోవాలి. కానీ... అక్కడ ఉన్నది సుకుమార్ శిష్యుడు. అతని మాధిరిగానే ఈ చిత్రాన్ని నిదానంగా తీస్తున్నాడని టాక్. దీని మూలంగానే బ‌డ్జెట్ ఎక్కువైపోతోంద‌న్న వార్త‌లు వినిపిస్తున్నాయి.

  English summary
  Vijay Sethupathi Remuneration For Vaishnav Tej Uppena Is Burden For makers. Movie Shooting I sGoin Very Slow, makers Want Vijay's Dates More. In Thi sCase Vijay Hiked His Remuneration. This Movies Is Produced By Mythri Movies Directed By Buchi Babu.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more
  X