Don't Miss!
- Sports ఆ రూల్ మా కొంపముంచింది- రుతురాజ్
- News మే 1 నుంచి ఈ రాశులకు అఖండ ధనయోగం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఆ హీరోకు ఒకేసారి 100కోట్లు ఇస్తున్న దిల్ రాజు.. ప్రభాస్ రికార్డును బ్లాస్ట్ చేసేలా ఉన్నాడు
స్టార్ హీరోల రెమ్యునరేషన్స్ ఈ రోజుల్లో పెట్రోల్ రేట్ల కంటే వేగంగా పెరుగుతున్నాయి. సినిమా మేకింగ్ ను బట్టి అలాగే పాన్ ఇండియా రేంజ్ ను బట్టి కూడా పారితోషికం డోస్ పెంచుతున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక స్టార్ హీరోకు తెలుగు నిర్మాత దిల్ రాజు 100కోట్ల రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 10కోట్ల వరకు అడ్వాన్స్ కూడా ఇచ్చారని టాక్ వస్తోంది.
సక్సెస్ రేటు ఎక్కువగా..
టాలీవుడ్ లోనే కాకుండా సౌత్ ఇండస్ట్రీ మొత్తంలో చూసుకుంటే సక్సెస్ రేటు ఎక్కువగా ఉన్న మంచి నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. మంచి కంటెంట్ ను ఎంచుకొని కొత్త వారికి అవకాశం ఇవ్వడంలో ముందుంటారు. ఆయన నుంచి చాలామంది ప్రముఖ దర్శకులు ఇండస్ట్రీలోకి వచ్చినవారే.
ఇండస్ట్రీకి స్టార్ దర్శకులను పరిచయం చేసిన దిల్ రాజు
సుకుమార్, శ్రీకాంత్ అడ్డాల, బొమ్మరిల్లు భాస్కర్, వేణు శ్రీరామ్, వంశీ పైడిపల్లి వంటి విభిన్నమైన దర్శకులు దిల్ రాజు స్కూల్ నుంచి వచ్చినవారే. ఒక సినిమాను నిర్మించడంతో పాటు రిలీజ్ చేయించడంలో కూడా ఆయన విధానం చాలా విభిన్నంగా ఉంటుంది. హ్యాపీడేస్ లాంటి సినిమాను చాలా తెలివిగా రిలీజ్ చేసి బాక్సాఫీస్ హిట్ అందుకునేలా చేశారు.
పాన్ ఇండియా రేంజ్ లో
పెట్టిన పెట్టుబడికి ఎలాగైనా లాభాలు తెప్పించాలనే ఆలోచనతో ముందుకు వెళ్లే దిల్ రాజు గత కొంతకాలంగా అగ్ర హీరోలను ఎక్కువగా టచ్ చేస్తున్నారు. ఇటీవల వకీల్ సాబ్ హిట్టయిన విషయం తెలిసిందే. ఇక నెక్స్ట్ పాన్ ఇండియా రేంజ్ లో కూడా సినిమా చేయాలని ఆలోచిస్తున్నారు. ప్రభాస్ తో ఇప్పటికే ఒక కమిట్మెంట్ ఉంది.
Recommended Video
విజయ్ కోసం 100కోట్లు
అయితే కోలీవుడ్ స్టార్ విజయ్ తో కూడా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా కోసమని విజయ్ కు ఏకంగా 1000కోట్ల వరకు రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి.
ఇప్పటివరకు దిల్ రాజు ఏ హీరోకు కూడా ఆ రేంజ్ లో రెమ్యునరేషన్ ఇచ్చింది లేదు. ఇక విజయ్ తో అగ్రిమెంట్ కోసం అడ్వాన్స్ గా 10కోట్లు కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.