తమన్నాతో బ్రేకప్.. కొత్త గర్ల్‌ఫ్రెండ్‌తో విజయ్ వర్మ వాలెంటైన్స్ డే అలా!

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా- నటుడు విజయ్ వర్మల మధ్య బ్రేకప్ చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. దాదాపు మూడేళ్లపాటు పీకల్లోతు ప్రేమలో మునిగితేలిన వీరిద్దరూ అనూహ్యంగా విడిపోవడం చిత్ర పరిశ్రమకు షాకిచ్చింది. వీరి మధ్య బ్రేకప్‌కు దారితీసిన కారణాలు ఇప్పటికీ తెలియరాలేదు. ఎవరికి నచ్చిన విధంగా వారు కథలు అల్లేస్తున్నారు. తమన్నాతో బ్రేకప్ తర్వాత పలువురు హీరోయిన్లతో విజయ్ వర్మ డేటింగ్ చేస్తున్నట్లుగా గాసిప్స్ వచ్చాయి. తాజాగా ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయ్ వర్మ షాకిచ్చాడు. ఈ వివరాల్లోకి వెళితే..

లస్ట్ స్టోరీస్ 2 వెబ్‌సిరీస్‌లో తనతో కలిసి నటించిన విజయ్ వర్మతో తమన్నా భాటియా ప్రేమాయణం సాగిస్తున్నారని అప్పట్లో బీటౌన్ మీడియా కోడై కూసింది. ఇందులో విజయ్‌తో లిప్‌లాక్, ఇంటిమేట్ సీన్స్‌లో తమన్నా రెచ్చిపోవడం కూడా ఈ వార్తలకు బలం చేకూర్చాయి. 20 ఏళ్ల కెరీర్‌లో అందాల ఆరబోత వరకే పరిమితమైన మిల్కీబ్యూటీ ఇందులో శృంగార రసాన్ని ఒలికించింది. ఆ తర్వాత విజయ్‌తో ప్రైవేట్ పార్టీలు, డేట్స్, విహారయాత్రలకు వెళ్తూ తమన్నా పలుమార్లు మీడియాకు దొరికిపోయింది. అయినప్పటికీ వీరు తమ రిలేషన్ ఏంటన్నది మాత్రం బయటపెట్టలేదు. ఆ తర్వాత తాము డేటింగ్‌లో ఉన్నామని వీరు అంగీకరించారు.

Vijay Varma s Valentine s Day Post Sparks Dating Rumors After Tamannaah Bhatia Breakup

విజయ్ - తమన్నాల పెళ్లి ఎప్పుడు? అంటూ రకరకాల రూమర్స్ వైరల్ అయ్యాయి. రేపోమపో పెళ్లి చేసుకుని గుడ్‌న్యూస్ చెబుతారని అంతా భావిస్తుండగా.. సెడన్‌గా బ్రేకప్ చెప్పుకుని అందరికీ షాకిచ్చింది ఈ జంట. తమన్నా- విజయ్‌ల మధ్య బ్రేకప్‌కు దారి తీసిన కారణాలపై మీడియాలో అనేక కథనాలు ప్రసారమయ్యాయి. అయితే పెళ్లి చేసుకుని జీవితంలో సెటిలవ్వాలని తమన్నా పట్టుబట్టగా.. కెరీర్‌పై ఫోకస్ పెట్టాలని విజయ్ వర్మ పట్టుదలగా ఉండటంతో ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు రావడం వల్లే ఈ జంట విడిపోయిందని బీటౌన్ మీడియా వాదిస్తోంది. బ్రేకప్ తర్వాత ఎవరి దారులు వారివి అయ్యాయి.

తమన్నా తన సినిమాలు, ఐటెం సాంగ్స్‌తో బిజీగా ఉండగా.. విజయ్ వర్మ వరుసపెట్టి వెబ్ సిరీస్‌లు, ఇతర ప్రాజెక్ట్స్‌లో నటిస్తున్నాడు. బ్రేకప్ తర్వాత తమన్నా .. మరొకరిని తన జీవితంలోకి ఆహ్వానించలేదు. అయితే విజయ్ వర్మ మాత్రం పలువురు హీరోయిన్లతో సన్నిహితంగా ఉంటూ కొత్త అనుమానాలు క్రియేట్ చేశాడు. దంగల్ బ్యూటీ ఫాతిమా సనా షేక్‌తో విజయ్ ప్రేమాయణం సాగిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. వీరిద్దరూ ఓ హోటల్‌లో నుంచి బయటకు రావడంతో పాటు పార్టీలలో కనిపించడంతో ఈ అనుమానాలకు బలం చేకూరింది.

అయితే ఈ గాసిప్స్‌ను ఫాతిమా ఖండించారు. మా ఇద్దరి మధ్యా ఎలాంటి అనుబంధం లేదని ఒకే సినిమాలో కలిసి నటిస్తోన్న నటీనటుల మధ్య ఫ్రెండ్‌షిప్ ఉంటుందని, ఆ సాన్నిహిత్యంతో ఇద్దరం కలిసి భోజనం చేశామని ఆమె చెప్పుకొచ్చారు. అయినప్పటికీ ఈ పుకార్లకు తెరపడలేదు. తాజాగా వాలెంటైన్స్ డేను పురస్కరించుకుని విజయ్ వర్మ షాకిచ్చాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయన పోస్ట్ కలకలం రేపుతోంది. ఈ పోస్ట్‌లో ఒక అబ్బాయి, ఒక అమ్మాయి చేతిలో చేయ్యేసి ఉంది. కానీ అది ఎవరు అనేది మాత్రం విజయ్ రివీల్ చేయలేదు. ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు అని రాసుకొచ్చి దానికి లవ్ ఎమోజీ జోడించాడు. దీనిని ఖుషి అహుజా అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌కు ట్యాగ్ చేశాడు. దీంతో విజయ్ వర్మ మరోసారి ప్రేమలో పడ్డాడని సినీజనాలు భావిస్తున్నారు. సదరు ఖుషి అహుజా ఎవరు? అనే దానిపై ఆరా తీస్తున్నారు. మరి విజయ్ వర్మ నిజంగానే మరోసారి ప్రేమలో పడ్డాడా? లేక జనాన్ని కన్‌ఫ్యూజన్‌లో పడేస్తున్నాడా అన్నది త్వరలోనే తేలిపోనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X