తమన్నాతో బ్రేకప్.. జవాన్ నటితో విజయ్ వర్మ డేటింగ్? రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన జంట
సుమారు మూడేళ్లపాటు ప్రేమలో మునిగితేలిన విజయ్ వర్మ- తమన్నా భాటియా జంట అనూహ్యంగా విడిపోవడం చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశమైంది. వీరిద్దరు ఎందుకు విడిపోయారు అనే దానిపై పలు రకాల వాదనలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. జీవితంలో పెళ్లి చేసుకుని స్థిరపడాలని తమన్నా.. కెరీర్‌లో మరింత ముందుకు సాగాలని విజయ్ వర్మ నిర్ణయం తీసుకున్నారని బీటౌన్ మీడియా కోడై కూసింది. ఈ బ్రేకప్‌తో తమన్నా- విజయ్‌ల దారులు వేరయ్యాయి. తమన్నా సినిమాలు, తన బిజినెస్ వ్యవహారాలలో బిజీగా ఉండగా.. విజయ్ తన సినిమాలతో పాటు కొందరు అమ్మాయిలతో తిరుగుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా విజయ్ ఓ అమ్మాయితో దొరికిపోయాడు. ఈ వివరాల్లోకి వెళితే..
లస్ట్ స్టోరీస్ 2 వెబ్‌సిరీస్‌లో తన సహనటుడు విజయ్ వర్మతో తమన్నా భాటియా ప్రేమాయణం సాగిస్తున్నారని అప్పట్లో సోషల్ మీడియాలో గాసిప్స్ వైరలయ్యాయి. ఈ వెబ్‌సిరీస్‌లో విజయ్‌తో లిప్‌లాక్, ఇంటిమేట్ సీన్స్‌లో తమన్నా రెచ్చిపోవడం కూడా ఈ వార్తలకు బలం చేకూర్చాయి. నటిగా తన 20 ఏళ్ల కెరీర్‌లో అందాల ఆరబోత వరకే పరిమితమైన మిల్కీబ్యూటీ ఇందులో గ్లామర్ డోస్ పెంచి బెడ్‌రూం సీన్స్‌లో రెచ్చిపోయింది. ఈ సినిమా తర్వాత విజయ్- తమన్నాలు ప్రైవేట్ పార్టీలు, డేట్స్, విహారయాత్రలకు వెళ్తూ కెమెరాలకు దొరికిపోయారు. అయినప్పటికీ వీరు తమ రిలేషన్ మాత్రం బయటపెట్టలేదు. ఈ క్రమంలో ఇద్దరూ అంగీకరించక తప్పలేదు. ఈ నేపథ్యంలో విజయ్ - తమన్నాల పెళ్లి ఎప్పుడు? అంటూ రకరకాల రూమర్స్ వైరల్ అయ్యాయి. కానీ అందరికీ షాకిచ్చేలా ఈ జంట విడిపోవడం కలకలం రేపింది.

తమన్నాతో బ్రేకప్ తర్వాత విజయ్ వర్మ పలువురు హీరోయిన్లతో సన్నిహితంగా ఉంటూ కొత్త అనుమానాలు క్రియేట్ చేస్తున్నాడు. తొలుత దంగల్ బ్యూటీ ఫాతిమా సనా షేక్‌తో విజయ్ డేటింగ్ చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. వీరిద్దరూ ఓ హోటల్‌లో నుంచి బయటకు రావడంతో పాటు పార్టీలలో కనిపించడంతో ఈ వార్తలకు బలం చేకూరినట్లయ్యింది. అయితే ఈ కథనాలను ఫాతిమా ఖండించారు. మేం కేవలం స్నేహితులం మాత్రమేనని, అంతకుమించి మా ఇద్దరి మధ్య ఏం లేదని తేల్చేశారు.
ఇక ఇటీవల వాలెంటైన్స్ డేను పురస్కరించుకుని విజయ్ వర్మ మరోసారి షాకిచ్చాడు. ఆరోజు ఆయన షేర్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ఒక అబ్బాయి, ఒక అమ్మాయి చేతిలో చేయ్యేసి ఉంది. ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు అని రాసుకొచ్చి దానికి లవ్ ఎమోజీ జోడించాడు. దీనిని ఖుషి అహుజా అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌కు ట్యాగ్ చేశాడు. దీంతో విజయ్ వర్మ మరోసారి ప్రేమలో పడ్డాడని అనుకున్నారు. ఇప్పుడు తాజాగా విజయ్ వర్మ గురించి మరో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
జవాన్ సినిమాలో నటించిన అలియా ఖురేషితో కలిసి విజయ్ వర్మ ఓ హోటల్ నుంచి బయటకు వస్తున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇద్దరూ కలిసి ముంబైలోని ఓ హోటల్ నుంచి బయటకు రావడం, ఒకే కారులో కలిసి వెళ్లడం అనేక అనుమానాలకు తావిస్తోంది. దీంతో అలియాతో విజయ్ డేటింగ్ చేస్తున్నారనే రూమర్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం విజయ్ నటిస్తోన్న మట్కా కింగ్‌లో అలియా కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. నటిగానే కాకుండా సింగర్‌గా, పాటల రచయితగా కూడా అలియా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మరి నిజంగానే విజయ్ - అలియాలు ప్రేమలో మునిగితేలుతున్నారా? లేక ఇవన్నీ ఊహాగానాలు మాత్రమేనా? అన్నది తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications


