Jana Nayagan Release Date: సమంతకు సీఎం విజయ్ బిగ్ షాక్.. బంగారానికి జన నాయగన్‌కు క్లాష్ తప్పదా?

తెలుగు, తమిళ సినీ ఇండస్ట్రీల్లో జూన్ 19 హాట్ టాపిక్‌గా మారింది. ఒకవైపు దళపతి విజయ్ చివరి సినిమా 'జననాయగన్' భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమవుతుండగా, మరోవైపు సమంత చాలా గ్యాప్ తర్వాత చేస్తున్న స్ట్రెయిట్ తెలుగు సినిమా 'మా ఇంటి బంగారం' కూడా అదే తేదీని టార్గెట్ చేయడం ఆసక్తిని పెంచుతోంది. ఇప్పటికే విజయ్ సీఎం అయిన తర్వాత వస్తున్న మొదటి సినిమా కావడంతో హైప్ పీక్‌లో ఉండగా, సమంత తన కమ్‌బ్యాక్ మూవీతో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాలని చూస్తోంది. ఈ ఇద్దరి మధ్య జరగబోయే ఈ బిగ్ క్లాష్ ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద చర్చగా మారింది.

సీఎం విజయ్ ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురు చూస్తున్న సినిమా జన నాయగన్ (Jana Nayagan). నిజానికి ఈ సినిమా సంక్రాంతికే విడుదల కావాల్సింది. కానీ, సెన్సార్ సమస్యల కారణంగా పదేపదే వాయిదా పడుతూ వచ్చింది. ముఖ్యంగా సినిమాలోని రాజకీయ డైలాగ్స్, యాక్షన్ సన్నివేశాలపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) అభ్యంతరాలు వ్యక్తం చేయడం వల్ల రిలీజ్ ఆలస్యం అయింది. దాదాపు నాలుగు నెలలుగా మేకర్స్ సెన్సార్ క్లియరెన్స్ కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ, సమస్యలు పూర్తిగా పరిష్కారం కాలేదని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

Vijay vs Samantha Box Office Clash Jana Nayagan vs Maa Inti Bangaram on June 19

ఈ ఆలస్యాల ప్రభావం సినిమా బిజినెస్‌పైనా పడింది. రిలీజ్ డిలే కారణంగా ఓటీటీ డీల్ కూడా క్యాన్సిల్ కావడం, అలాగే సినిమా బజ్ కొంత తగ్గిపోవడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. అయితే ఇటీవలి పరిణామాలు పరిస్థితిని పూర్తిగా మార్చేశాయి. తమిళనాడు రాజకీయాల్లో విజయ్ సంచలనం క్రియేట్ చేశాడు. ఎవరూ ఊహించని విధంగా ఆయన పార్టీ భారీ విజయం సాధించి, ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. దీంతో జననాయగన్ సినిమాపై మళ్లీ భారీ హైప్ తీసుకొచ్చాయి. సీఎం అయిన తర్వాత విడుదలయ్యే తొలి సినిమా కావడంతో ఈ మూవీకి ఏనాలేని క్రేజ్ ఏర్పడింది.

ప్రస్తుతం కోలీవుడ్ సర్కిల్స్‌ సమాచారం ప్రకారం.. జూన్ 19న 'జననాయగన్' విడుదల కావొచ్చని టాక్ నడుస్తోంది. కొన్ని ఆన్‌లైన్ టికెటింగ్ ప్లాట్‌ఫార్మ్స్‌లో కూడా ఇదే తేదీ కనిపించడం గమనార్హం. అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ, ఈ డేట్ ఫిక్స్ అయితే బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ తప్పదనే చెప్పాలి. ఎందుకంటే.. ఇదే సమయంలో, చాలా కాలం తర్వాత సమంత ( Samantha Ruth Prabhu)నటించిన స్ట్రెయిట్ తెలుగు సినిమా ' మా ఇంటి బంగారం'(Maa Inti Bangaram)కూడా జూన్ 19నే విడుదలకు సిద్ధమవుతోంది.

నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని సమంత స్వంత బ్యానర్ ట్రాలాలా పిక్చర్స్ నిర్మించింది. క్రైమ్ కామెడీ జానర్‌లో తెరకెక్కిన ఈ సినిమాపై సమంతకు భారీ ఆశలు ఉన్నాయి. ఐపీఎల్ ప్రభావం వల్ల మే నెల నుంచి వాయిదా వేసి, జూన్ 19ను టార్గెట్ చేశారు. అయితే ఇప్పుడు విజయ్ సినిమా అదే రోజున వస్తే.. సమంత మూవీకి ఇది పెద్ద సవాలుగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా విజయ్ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి భారీగా విడుదల కానుంది. సీఎం హోదా, చివరి సినిమా అనే హైప్ అన్ని కలిసివచ్చే అవకాశముంది.

సాధారణంగా విజయ్ సినిమాలు తెలుగులో కూడా గ్రాండ్ ఓపెనింగ్స్ సాధిస్తాయి. అలాంటిది ఈసారి పరిస్థితి మరింత భిన్నంగా ఉంది. ఈ నేపథ్యంలో థియేటర్ల కేటాయింపు కూడా కీలక అంశంగా మారనుంది. పెద్ద హీరో సినిమా వచ్చినప్పుడు ఎక్కువ స్క్రీన్స్ దానికి కేటాయించే పరిస్థితి ఉంటుంది. దీంతో 'మా ఇంటి బంగారం'కు థియేటర్లు దొరకడమే కష్టంగా మారే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అలాగే ప్రేక్షకుల ఫుట్‌ఫాల్ కూడా రెండు సినిమాల మధ్య విడిపోయే ప్రమాదం ఉంది.

ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం.. ఒకవేళ 'జననాయగన్' నిజంగా జూన్ 19న విడుదలైతే, సమంత టీమ్ మరో రిలీజ్ డేట్‌పై ఆలోచించే అవకాశముందట. ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడిన ఈ సినిమా మళ్లీ పోస్ట్‌పోన్ అయితే, అది ప్రమోషన్స్‌పై కూడా ప్రభావం చూపే అవకాశముంది. మరోవైపు, కంటెంట్ బలంగా ఉంటే పోటీని తట్టుకుని నిలబడే అవకాశం కూడా ఉంటుంది. సమంత నటన, నందిని రెడ్డి టేకింగ్‌పై ఇండస్ట్రీలో మంచి నమ్మకం ఉంది. కానీ విజయ్ సినిమా హైప్‌ను దృష్టిలో పెట్టుకుంటే, ఈ క్లాష్ నిజంగా ఆసక్తికరంగా మారింది. ఇలా జూన్ 19 బాక్సాఫీస్ వద్ద భారీ పోటీకి వేదిక కానుంది.ఈ రెండు సినిమాల మధ్య పోటీ ఎలా ఉండబోతోందో చూడాలి. రిలీజ్ డేట్స్‌పై క్లారిటీ వచ్చిన తర్వాతే అసలు గేమ్ మొదలవుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X