త్రివిక్రమ్ రచనతో పవన్ కళ్యాణ్ నెక్ట్స్
పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో జల్సా చిత్రం వచ్చి హిట్టయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ కాంబినేషన్ మరో సారి రిపీట్ కానుంది. అయితే ఈ సారి త్రివిక్రమ్ కేవలం కథ, మాటలు మాత్రమే ఇస్తున్నాడు. కె విజయ్ భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నాడు. విజయ భాస్కర్ గతంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో నువ్వు నాకు నచ్చావ్, నువ్వే కావాలి, మన్మధుడు,మల్లేశ్వరి వంటి ఎన్నో సూపర్ హిట్స్ ఇచ్చారు. అయితే త్రివిక్రమ్ దర్శకుడు అయిన తర్వాత ఆయన భలే దొంగలు అనే చిత్రం తీసారు కానీ వర్కవుట్ కాలేదు. దాంతో మరో సారి త్రివిక్రమ్ రచనతోనే హిట్టు కొట్టాలని నిర్ణయించుకున్నారు. ఇక ఈ చిత్రాన్ని గణేష్ బాబు నిర్మించనున్నారు. గణేష్ బాబు ఇంతకుముందు రవితేజ తో ఆంజనేయులు చిత్రాన్ని రూపొందించారు. ప్రస్తుతం పవన్ చేస్తున్న పులి చిత్రం అనంతరం విజయ్ భాస్కర్ చిత్రం ఉండే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











