twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విజయ నిర్మల మళ్ళీ మొదలుపెట్టింది

    By Srikanya
    |

    అత్యధిక చిత్రాలు చేసి గిన్నిస్ బుక్ కి ఎక్కిన మహిళా దర్శకురాలు విజయనిర్మల త్వరలో మెగాఫోన్ పట్టనున్నారని సమాచారం. అయితే ఆమె డైరక్ట్ చేయబోయేది సూపర్ స్టార్ కృష్ణని కాదు. ఆమె మనవడు ననీన్ ని(నరేష్ కుమారుడు). ఈ చిత్రం స్క్రిప్టు వర్క్ గత ఆరు నెలలు గా నిరవధికంగా జరుగుతున్నట్లు సమాచారం. ఈ చిత్రం ఓ సరికొత్త ప్రేమ కథను కుటుంబ బంధాల నేపధ్యంలో చూపించనుందని సమాచారం. అలాగే ఈ చిత్రంలో కృష్ణ,నరేష్ కూడా కలిసి నటిస్తారని చెప్తున్నారు. ఈ వేసవిలో ఈ చిత్రం షూటింగ్ పారంభమయ్యే అవకాశం ఉంది. అందుకోసం ఇప్పటికే ఆమె లొకేషన్స్ ని ఎంపిక చేసి పర్మిషన్స్ కోసం మేనేజర్స్ ని పురమాయించారని వినికిడి. ఇక తన మనవడని తెరంగ్రేటం చేయటమే కాక తాను తిరిగి దర్శకురాలుగా నిరూపించుకోవాలనే తపనతోనే ఈ చిత్రం ప్రాజెక్టుని ప్రెస్టేజియస్ గా భావించి చేస్తున్నారు. ఇక విజయ నిర్మల ఆ మధ్యన కృష్ణతో నేరము-శిక్ష చిత్రం రూపొందించారు. అది భాక్సాఫీస్ వద్ద పేలిపోయింది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X