గ్లామర్ పాత్రల నుండి ప్రక్కకు జరిగి ప్రతిఘటన, రేపటిపౌరులు, కర్తవ్యం, ఆశయం, ఒసేయ్ రాములమ్మ వంటి సినిమాలతో యాక్షన్ హీరోయిన్ గా విజయశాంతి గుర్తింపు పొందింది. కొంతకాలం లేడీ ఓరియంటడ్ చిత్రాలతో చెలరేగిన ఆమె రాజకీయాలలో ప్రవేశించి 'తల్లి తెలంగాణ' పార్టీ పెట్టి తెలంగాణా గానం ఎత్తుకుంది. తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ విధానాలపై విమర్శలు వర్షం కురిపిస్తూ, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావును దుమ్మెత్తిపోస్తూ ప్రజల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. కానీ చిత్రంగా లైమ్‌లైట్‌లో ఉన్నప్పటి క్రేజ్ కనపడటం లేదు. దాంతో సన్నిహితులు ఆమె మళ్ళీ కెమేరా ముందుకు వస్తే మంచిదేమో నని సూచించారు. మరో వైపు తమిళ దర్శకుడు శక్తి చిదంబరం ఇటీవల 'ఇది'అనే తమిళ సినిమా కోసం ఆమెను సంప్రదించాడుట. కథను మలుపు తిప్పే పవర్ ఫుల్ క్యారెక్టరు గా దీన్ని రూపొందించి మరీ కలిసారట. దాంతో ఆమెలో ఈ ఆలోచన మరింత బలపడిందిట. సినిమాలో నటించి మరోసారి డేషింగ్ హీరోయినుగా తన సత్తా చాటాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం.