Don't Miss!
- News రాహుల్ సహా నేడు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటోన్న కీలక నేతలు వీరే..
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్‌తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మహేష్‌బాబు మూవీలో విజయశాంతి... రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాకే!
లేడి అమితాబ్‌గా దక్షిణాదిలో క్రేజ్ సంపాదించుకొన్న విజయశాంతి చాలా కాలంగా ముఖానికి మేకప్ లేకుండా సరిపెట్టుకొంటున్నారు. రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత సినీ రంగం వైపు చూసిన దాఖలాలు లేవు. ఈ మధ్య కాలంలో అలనాటి హీరోయిన్లు మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్న నేపథ్యంలో ఇటీవల విజయశాంతిని కూడా ఓ కీలక పాత్ర కోసం అడిగారట. అయితే విజయశాంతి అందుకు సానుకూలంగా స్పందించడమే కాకుండా రెమ్యునరేషన్ కోసం ఆమె చేసిన డిమాండ్ వ్యవహారం క్రేజీగా మారింది. ఆమె ఎంత అడిగారంటే..
విజయశాంతి క్రేజ్ ఎలా ఉండేదంటే
గతంలో హీరోయిన్ ప్రాధాన్యతతో రూపొందిన సినిమాల్లో యాంగ్రీ ఉమెన్‌గా విజయశాంతి మెప్పించింది. ఆమె నటించిన సినిమాల వసూళ్లు స్టార్ హీరోలకు ఏ మాత్రం తీసిపోకుండా ఉండేవి. స్టార్ హీరోయిన్గా రాణించే సమయంలోనే సినిమాలకు బ్రేక్ చెప్పి పాలిటిక్స్‌లో చేరిపోయారు. అప్పటి నుంచి పలు ఆఫర్లు ఆమెను పలకరించినా పెద్దగా స్పందించలేదు. తాజాగా ఆమె మహేష్‌బాబు చిత్రంలో నటించమని ఆమెకు ఆఫర్ ఇచ్చారట.
మహేష్‌బాబు మూవీలో కీలక పాత్ర
మహర్షి సినిమా తర్వాత అనిల్ రావిపూడి సినిమాల్లో మహేష్ బాబు నటించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఆమె ఈ సినిమా కోసం భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నట్టు సినీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఆమె అడిగిన పారితోషికం స్టార్ హీరోలకే జెలసీ పుట్టించేలా ఉన్నట్టు సమాచారం.
భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో
అనిల్ రావిపూడి, మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చే సినిమాలో నటించడం ద్వారా విజయశాంతి రీ ఎంట్రీ ఇస్తున్నారు. అనిల్ రావిపూడి చెప్పిన కథ నచ్చడంతో ఆ పాత్రలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అందు కోసం ఆమె రూ.5 కోట్ల రెమ్యునరేషన్‌ను డిమాండ్ చేశారు. ఆమెతోనే ఆ పాత్రను చేయించాలని నిర్మాతలు భావించడం వలన.. ఆ మొత్తాన్ని ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. కాకపోతే ఎంతో కొంత తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు అని సినీ వర్గాలు వెల్లడించాయి.
40 ఏళ్లుగా మూవీ ఇండస్ట్రీలో హల్చల్
దక్షిణాది చిత్ర పరిశ్రమలో విజయశాంతిది 40 సంవత్సరాల సుదీర్ఘమైన కెరీర్. గ్యాంగ్ లీడర్, ఒసే రాములమ్మ, రౌడీ మొగుడు, కర్తవ్యం లాంటి చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించింది. ఆమె చివరిసారిగా 2006లో నాయుడమ్మ అనే సినిమాలో కనిపించారు. అప్పటి నుంచి సినీ పరిశ్రమకు దూరంగా ఉన్నారు.