RC16: రామ్ చరణ్ తల్లిగా చిరంజీవి హీరోయిన్.. ఈ పవర్‌ఫుల్ లేడీనే ఎందుకంటే!
తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి కొందరు హీరోలు పాన్ ఇండియా రేంజ్‌కు ఎదిగారు. తద్వారా దేశ వ్యాప్తంగా మార్కెట్‌ను, ఫాలోయింగ్‌ను ఏర్పరచుకుని సత్తా చాటుతున్నారు. అలాంటి వారిలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒకడు. ఈ మధ్య కాలంలో వరుస హిట్లతో దూసుకెళ్తోన్న అతడు.. గ్లోబల్ స్టార్‌గా మారిన తర్వాత జెట్ స్పీడుతో ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటున్నాడు.
మెగా హీరో రామ్ చరణ్ ఇప్పుడు ఎస్ శంకర్ దర్శకత్వంలో 'గేమ్ చేంజర్' అనే మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రంపై ఆరంభంలోనే అంచనాలు నెలకొన్నాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగానే దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇక, ఈ సినిమా పట్టాలపై ఉండగానే రామ్ చరణ్ తన 16వ చిత్రాన్ని 'ఉప్పెన' డైరెక్టర్ బుచ్చిబాబు సనతో మరో భారీ ప్రాజెక్టును అనౌన్స్ చేసేశాడు.

రామ్ చరణ్ - బుచ్చిబాబు సన కాంబోలో రాబోతున్న ఈ సినిమా క్రీడా నేపథ్యంతో రాబోతుందని ఇప్పటికే సమాచారం లీక్ అయిపోయింది. అంతేకాదు, ఇందులో హీరో రన్నర్‌గా నటిస్తున్నాడని టాక్ వచ్చింది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. అతి త్వరలోనే ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కాబోతుందని ఫిలిం నగర్ సమాచారం.
అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ సినిమాలో ఎంతో మంది బడా స్టార్లు భాగం అవుతున్నారు. ముఖ్యంగా ఈ చిత్రంలో హీరోయిన్‌గా అలనాటి అందాల తార శ్రీదేవి కుమార్తెను తీసుకున్నారు. అలాగే, ముఖ్యమైన పాత్రల కోసం దేశ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న నటీనటులను ఎంపిక చేస్తున్నారు. ఇలా ఇప్పుడు చరణ్ తల్లి పాత్ర కోసం ఒకరిని ఫైనల్ చేసినట్లు తెలిసింది.
తాజా సమాచారం ప్రకారం.. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో రామ్ చరణ్ తల్లి పాత్రలో విజయశాంతి నటిస్తున్నట్లు తెలిసింది. ఇందులో ఆమె పాత్ర ఎవరూ ఊహించని విధంగా ఎంతో పవర్‌ఫుల్‌గా, నేచురల్‌గా ఉంటుందట. అందుకే గతంలో ఇలాంటి పాత్రలతో మెప్పించిన విజయశాంతిని తీసుకున్నారని అంటున్నారు. తాజాగా ఈ న్యూస్ లీక్ అవడంతో ఈ మూవీపై హైప్ పెరుగుతోంది.

ఇదిలా ఉండగా.. రామ్ చరణ్ - బుచ్చిబాబు కాంబోలో రూపొందిస్తోన్న ఈ సినిమా దాదాపు రూ. 400 కోట్లు బడ్జెట్‌తో తెరకెక్కనుంది. దీన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకటేష్ సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. అలాగే, ఈ మూవీకి మైత్రీ మూవీ మేకర్స్‌తో పాటు సుకుమార్ రైటింగ్స్ సంస్థలు నిర్మాణ భాగస్వాములుగా వ్యవహరిస్తున్నాయి. దీనికి ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ ఇస్తున్నారు.


Click it and Unblock the Notifications











