చిరంజీవికి షాకిచ్చిన లేడీ పొలిటీషియన్.. బంపర్ ఆఫర్ ఇచ్చినా నో చెప్పేసిందా!
ఆరు పదుల వయసు దాటినా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్నారు. ముఖ్యంగా సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయన ఎంతో వేగంగా ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తూ వెళ్తున్నారు. ఇలా ఇప్పటికే ఎన్నో చిత్రాలతో ఆయన ప్రేక్షకులను అలరించారు. ఈ క్రమంలోనే ఇప్పుడు చిరు 'విశ్వంభర' మూవీలో నటిస్తున్నారు.
'బింబిసార' చిత్రంతో దర్శకుడిగా సత్తా చాటుకున్న మల్లిడి వశిష్ట రూపకల్పనలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న మూవీనే 'విశ్వంభర'. పంచభూతాలు, ముల్లోకాలు అనే కాన్సెప్టుతో సోషియో ఫాంటసీ జోనర్‌లో ఈ చిత్రం రూపొందుతోంది. దీంతో ఈ సినిమాపై అంచనాలు క్రమంగా పెరుగుతున్నాయి. అందుకు తగ్గట్లుగానే దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి - మల్లిడి వశిష్ట కలయికలో రూపొందుతోన్న 'విశ్వంభర' సినిమాకు సంబంధించిన షూటింగ్ ఆ మధ్యనే ప్రారంభం అయింది. అప్పటి నుంచి వరుసగా షెడ్యూళ్లను ప్లాన్ చేసుకుంటూ షూటింగ్‌కు చక్కగా నడుపుకుంటూ వస్తున్నారు. ఇలా ఇప్పుడు కూడా మెగాస్టార్ చిరంజీవితో పాటు ప్రధాన నటీనటులపై అత్యంత కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
గ్రాఫిక్స్ వండర్‌గా రాబోతున్న 'విశ్వంభర' మూవీలో హీరోయిన్‌గా త్రిషను తీసుకున్న విషయం తెలిసిందే. ఆమెతో పాటు ఎంతో మంది ప్రముఖులు ఇందులో కీలక పాత్రలను చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ చిత్రంలోనే అత్యంత ముఖ్యమైన పాత్ర కోసం డైనమిక్ లేడీ విజయశాంతిని సంప్రదించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో దీనిపై ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. 'విశ్వంభర' సినిమా కోసం విజయశాంతిని చిత్ర యూనిట్ సంప్రదించిందట. కానీ, ఇందులో నటించేందుకు ఆమె అంగీకరించలేదని తాజాగా న్యూస్ లీకైంది. దీనికి కారణం ఆమె పార్లమెంట్ ఎన్నికల కోసం పని చేస్తుండడమే అని తెలిసింది. ఈ రెండింటికీ డేట్స్ అడ్జస్ట్ చేయలేకనే విజయశాంతి ఈ సినిమా చేయట్లేదని సమాచారం.
ఇదిలా ఉండగా.. మెగాస్టార్ చిరంజీవి - వశిష్ట కలిసి చేస్తున్న 'విశ్వంభర' మూవీని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇందులో త్రిష హీరోయిన్‌గా చేస్తోంది. అలాగే, సురభి, ఇషా చావ్లా, రమ్య పసుపులేటి, నవీన్ చంద్ర, రాజ్ తరుణ్‌లు కీలక పాత్రలను చేస్తున్నారని తెలిసింది. ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 10 తేదీన విడుదల చేయనున్నారు.


Click it and Unblock the Notifications











