రామ్ చరణ్‌కు స్టార్ హీరోయిన్ షాక్.. చిరంజీవిని కూడా కాదన్న పవర్‌ఫుల్ లేడీ
టాలీవుడ్‌లోని హీరోల్లో చాలా మంది పాన్ ఇండియా బాటలో నడుస్తున్నారు. అయితే, అందులో కొందరు మాత్రమే వరుసగా ఫ్యూచర్ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటూ మరింత జోష్‌తో సాగిపోతోన్నారు. అలాంటి వారిలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఒకడు. ఇటీవలి కాలంలో ఫుల్ ఫామ్‌లో ఉన్న అతడు.. రెట్టించిన ఉత్సాహంతో సినిమాల మీద సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు.
మెగా హీరో రామ్ చరణ్ ప్రస్తుతం ఎస్ శంకర్ దర్శకత్వంలో 'గేమ్ చేంజర్' అనే మూవీని చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంపై ఆరంభంలోనే అంచనాలు నెలకొన్నాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగానే దీన్ని తీస్తున్నారు. ఇక, ఇది పట్టాలపై ఉండగానే రామ్ చరణ్ తన 16వ చిత్రాన్ని 'ఉప్పెన' డైరెక్టర్ బుచ్చిబాబు సనతో చేస్తున్నట్లు అనౌన్స్ చేసేశాడు.

రామ్ చరణ్ - బుచ్చిబాబు కలిసి చేస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం క్రీడా నేపథ్యంతో రాబోతుందని ఇప్పటికే వార్తలు వచ్చేశాయి. అంతేకాదు, ఇందులో హీరో రన్నర్‌గా నటిస్తున్నాడని అంటున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ వేగంగా సాగుతోంది. అతి త్వరలోనే ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్‌ను మొదలెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
రామ్ చరణ్ కెరీర్‌లోనే హై రేంజ్‌లో రూపొందనున్న ఈ చిత్రంలో ఎంతో మంది సీనియర్, స్టార్, జూనియర్ నటీనటులను తీసుకుంటున్నారు. ఇలా ఇప్పటికే ఎంతో మందిని సైతం ఫైనల్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఇందులో రామ్ చరణ్ తల్లి పాత్రకు విజయశాంతిని ఫిక్స్ చేశారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది.
ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతోన్న సమాచారం ప్రకారం.. రామ్ చరణ్ చిత్రంలో నటించేందుకు విజయశాంతి ఆసక్తి చూపించలేదట. ఆమె ఓ రాజకీయ పార్టీలో క్రియాశీలకంగా ఉన్న కారణంగానే సినిమాలు చేయకూడదని డిసైడ్ అయినట్లు తెలిసింది. అందుకే చిరంజీవి నటిస్తోన్న 'విశ్వంభర' మూవీ ఆఫర్‌ను సైతం విజయశాంతి రిజెక్ట్ చేశారనే టాక్ వినిపిస్తోంది. మొత్తానికి తండ్రి, కొడుకు సినిమాలు చేయనని చెప్పడంతో విజయశాంతి పేరు హాట్ టాపిక్ అవుతోంది.

ఇదిలా ఉండగా.. రామ్ చరణ్ - బుచ్చిబాబు కలయికలో రాబోయే ఈ సినిమా దాదాపు రూ. 400 కోట్లు బడ్జెట్‌తో తెరకెక్కనుంది. దీన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకటేష్ సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. అలాగే, ఈ మూవీకి మైత్రీ మూవీ మేకర్స్‌తో పాటు సుకుమార్ రైటింగ్స్ సంస్థలు నిర్మాణ భాగస్వాములుగా వ్యవహరిస్తున్నాయి. దీనికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం ఇస్తున్నారు.


Click it and Unblock the Notifications











