మహేశ్ సినిమాలో విజయశాంతి రోల్ ఇదే.. బయటకొచ్చిన ఇంట్రెస్టింగ్ న్యూస్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను అనిల్ సుంకర, దిల్ రాజులతో కలిసి మహేష్ బాబు స్వయంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మహేశ్ బాబు ఆర్మీ మేజర్‌ పాత్రను పోషిస్తున్నాడు. ఇందులో మహేశ్ సరసన రష్మిక మందన్న నటిస్తుండగా, ఈ సినిమా ద్వారా లేడీ అమితాబ్ విజయశాంతి మరోసారి మేకప్ వేసుకుంటున్నారు. దీనికి సంబంధించిన ఫొటోను ఇటీవల దర్శకుడు సోషల్ మీడియా ద్వారా షేర్ చేసిన విషయం తెలిసిందే.

2006లో 'నాయుడమ్మ' అనే సినిమాలో చివరి సారిగా కనిపించిన విజయశాంతి.. ఆ తర్వాత మరోసారి ఆమె మేకప్ వేసుకోలేదు. సినిమాలకు బ్రేకిచ్చి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రాములమ్మ.. తెలుగు రాష్ట్రాల్లో తన మార్కును చూపించారు. ఎంపీగా విజయం సాధించిన తర్వాత మరింత స్పీడు పెంచారు. తెలంగాణ ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత పార్టీ మారడంతో కొంచెం వెనుకబడ్డారు. ఇక, రీఎంట్రీలో మాత్రం దుమ్ము దులుపుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆమె అధికార పార్టీపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.

Vijayashanti Role In Mahesh Babus Sarileru Neekevvaru

ఈ నేపథ్యంలో ఆమె మహేశ్ సినిమా ద్వారా మరోసారి టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. అయితే, 'సరిలేరు నీకెవ్వరు'లో విజయశాంతి ఏ పాత్రలో నటిస్తున్నారన్న దానిపై ఎవరికీ క్లారిటీ లేదు. కానీ, దీని గురించి ఎన్నో వార్తల ప్రచారం అయ్యాయి. ఆమె.. మహేశ్ తల్లిగా నటిస్తుందని కొందరు అంటే.. కాదు కాదు.. మహేశ్ స్నేహితుడి తల్లిగా కనిపించబోతుందని మరికొందరు చెప్పుకొచ్చారు. ఈ విషయంపై తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది.

ఈ సినిమాలో విజయశాంతి ప్రొఫెసర్‌గా కనిపించబోతున్నారట. అది కూడా పవర్‌ఫుల్ క్యారెక్టర్ అని తెలిసింది. ఇందులో ఆమె పాఠాలు చెప్పడంతో పాటు ఎంతో మందిని చైతన్యపరిచే డైలాగ్స్ చెబుతుందని టాక్. గతంలో కూడా విజయశాంతి ఈ తరహా పాత్రలు చేశారు. అప్పుడు ఆమెకు అవార్డులు కూడా వచ్చాయి. ఇప్పుడు కూడా అదే స్థాయిలో ఈ లేడీ అమితాబ్ నటించనున్నారనే టాక్ వినిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X